Tuesday, December 17, 2024

హైదరాబాద్ లో కుండపోత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో : వర్షం నగరంలో మరో సారి బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో తడిసిముద్దైయ్యారు. కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో వాహనాలు భారీ తీరాయి.గంటల తరబడి ట్రాఫిక్ చక్రబంధనంలో చిక్కుకోవడంతో ప్రయాణికులు అల్లాడి పోయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో సాయంత్రం వేళా సరదా గడిపేందుకు కుటుంబ సభ్యులతో బయటి వచ్చిన పలువురు రోడ్లపై చిక్కుకుపోయ్యారు. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్‌తో రోడ్లపై అష్టకష్టాలు పడ్డారు. శుక్రవారం కురిసిన భారీ వర్షం నుంచి నగరవాసులు తెరుకోనేలేదు. ఇప్పటీకి పలు కాలనీలు బస్తీల్లో వరద నీరు అలాగే ఉంది. దీంతో మోటార్ల సహాయంతో వరద నీటిని తోడివేసుకుంటున్నారు .

ఇంతలోపే ఆదివారం సైతం మరోసారి భారీ వర్షం కురవడంతో లొతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు బస్తీలు మళ్లీ వరద నీరు పొటెత్తింది. దీంతో వందలాది కాలనీలు బస్తీల్లో పరిస్థితి మొదటికి వచ్చింది. వరస వర్షాలతో చెరువులు, కుంటలు ఇప్పటీకే నిండు కుండలను తలపిస్తుండడంతో మళ్లీ వర్షం కురువడంతో పరిసర ప్రాంతాల వాసులు ఎక్కడినుంచి ఏ క్షణంలో వరద ముంచుకువస్తోందని భయాందోళనలకు గురవుతున్నారు. గంటలోపే రాజేంద్రనగర్, బాలనగర్‌లో 3 సెమిలకు పైగా వర్షం కురిసింది. అయితే హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ 2 సె.మి లోపు వర్షం నీటి మాత్రమే తట్టుకునే సామర్థం ఉండగా, కుండపోతగా వర్షం కురుస్తుండడంతో వరద నీరు నగరాన్ని ముంచెత్తుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్, అమీర్‌పేట్ , కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, యూసుప్‌గూడ, లక్డీకాపూల్, మెహిదిపట్నం, టోలిచౌకి, లంగర్‌హౌజ్, ఆసీప్ నగర్, నాంపల్లి, కోఠి, అబిడ్స్, హిమాయత్‌నగర్, అంబర్‌పేట్, ఓయు తార్నాక, ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్‌పల్లి, తిరుమల్‌గిరి తో పాటు పలు ప్రాంతాలో 1 నుంచి3 సె.మి. లోపు వర్షం కురిసింది.

అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి 

నగరంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమైయ్యారు. వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు రోడ్లపై చేరిన వరదనీటిని తొలగించేందుకు కష్టాలు పడ్డారు. అయితే భారీ వర్షంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీసుల సహాయం వరద నీటిని తొలగించి ట్రాపిక్ క్లియర్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News