Monday, December 23, 2024

17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Four railway employees arrested in Rape of young woman

లక్నో: 17 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం పిలిభిత్ జిల్లా జహనాబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తన ఇంటి నుంచి దుకాణానికి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో ముగ్గురు వ్యక్తులు గన్‌తో బెదిరించి ఎత్తుకెళ్లారు. అనంతరం ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె తండ్రి సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారి ప్రభాస్ చంద్ర తెలిపాడు. ఆమె తండ్రి వీధి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News