Monday, December 23, 2024

నాలుగో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

sensex

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. బుల్స్ విజృంభించారు. గత పన్నెండు సెషన్లలోనే సెన్సెక్స్ , నిఫ్టీ రెండూ 9% చొప్పున పెరిగాయి. ఊహించిన విధంగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు జూలైలోనే దాదాపు $650 మిలియన్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. జీఎస్టీ వసూళ్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గడం కూడా కొంత కలిసొచ్చింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 545 పాయింట్లు లాభపడి 58,116 పాయింట్లకు పెరిగింది. నిఫ్టీ 182 పాయింట్లు పుంజుకుని 17,340 వద్ద స్థిరపడింది.

బిఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (6.15%), రిలయన్స్ (2. 64%), మారుతి (2.64%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.42%), భారతి ఎయిర్ టెల్ (2.40%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-2.65%), హిందుస్థాన్ యూని లీవర్ (-1.66%), నెస్లే ఇండియా (-0.49%), ఏసియన్ పెయింట్స్ (-0.26%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.23%).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News