- Advertisement -
న్యూఢిల్లీ: రోజు రోజుకూ మండుతున్న వంట గ్యాస్ ను దృష్టిలో ఉంచుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు కకోలి ఘోష్ లోక్ సభలో పచ్చి వంకాయ ఎత్తి చూపుతూ కొరికారు. వంట గ్యాస్ ధర పెంపుడు కారణంగా పేదలు ఎన్ని కష్టాలు పడుతున్నారనేది తెలిపే ఉద్దేశంతో ఆమె ఇలా చేశారు. ‘ధరల పెరుగుదలపై చర్చించడానికి అవకాశమిచ్చిన అధ్యక్షులకు తాను థ్యాంక్స్ చెబుతున్నట్లు కూడా తెలిపారు. ‘ఇలా వంట గ్యాస్ ధరలు పెంచేస్తుంటే మేము పచ్చి కూరగాయలే తినాలా?’ అంటూ ఆమె పచ్చి వంకాయ కొరికి చూయించారు. ‘గత కొన్ని నెలల్లోనే వంట గ్యాస్ ధర సిలిండర్ కు రూ. 600 నంచి రూ. 1100కు పెరిగింది’ అన్నారు. ‘జూలై నెలలో సిలిండర్ పై రూ. 50 పెంచారు. ఇలా పెంచడం ఇది 8వ సారి’ అన్నారు. అయినా ‘అచ్చే దిన్’, ‘18 ట్రిలియన్ ఎకనామీ దేశం’ వచ్చేస్తుంటే ఇదేం పని అనుకోవాలేమో!
- Advertisement -