Friday, December 20, 2024

తన భార్యను లైంగికంగా వేధిస్తున్న కానిస్టేబుల్ ముక్కు, చెవులు కోసేసిన భర్త..

- Advertisement -
- Advertisement -

లాహోర్: భార్యను బ్లాక్‌మెయిల్ చేయడమే కాక, అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడన్న కక్షతో పోలీస్ కానిస్టేబుల్ ముక్కు చెవులను భర్త కోసేసిన సంఘటన పాకిస్థాన్‌లో జరిగింది. లాహోర్‌కు 200 కిమీ దూరంలో అపంజాబ్ రాష్ట్రం ఝాంగ్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగిందని సోమవారం పోలీసులు వెల్లడించారు. తన భార్యను బ్లాక్‌మెయిల్ చేస్తూ అతనితో అక్రమ సంబంధాలు కొనసాగించాలని వేధిస్తున్నాడనే కారణంతో నిందితుడు ముహమ్మద్ లిప్తీకర్ తన స్నేహితులతో కలిసి పోలీస్ కానిస్టేబుల్ కాసిమ్ హయత్‌పై ఈ చర్యకు పాల్పడినట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు. అనుమానం పెంచుకున్న లిప్తీకర్ ఆదివారం విందులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న హయత్‌ని 12 మందితో కలిసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తీవ్రంగా హింసించిన తరువాత పదునైన ఆయుధంతో హయత్ చెవులు, ముక్కు, పెదాలు కోసివేశారని పంజాబ్ పోలీసులు వెల్లడించారు.

బాధిత కానిస్టేబుల్‌ను ఝాంగ్ జిల్లా ఆస్పత్రికి తరలించామని ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు. గత నెల హయత్‌పై పీపీసిలోని 354(మహిళపై దాడి), 384(దోపిడీ), 292 (అక్రమ సంబంధం) వంటి సెక్షన్ల కింద లిఫ్తీకర్ కేసు పెట్టాడు. తన కుమారుడిని చంపేస్తానని బెదిరించాడని, అతడి వద్దకు వెళ్లిన తన భార్యపై బలవంతంగా అత్యాచారం చేసి వీడియో తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ వీడియోల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నాడు. నిందితులు లిఫ్తీకర్‌తోపాటు అతడి అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Man Chops off nose and ears of Cop for harassing wife

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News