పాజిటివ్‌గా తేలిన నమూనాలు : కేరళ మంత్రి వీణాజార్జి
తిరువనంతపురం : మంకీపాక్స్ లక్షణాలతో కేరళలో 22 ఏళ్ల వ్యక్తి శనివారం మృతి చెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ యువకుడు మంకీపాక్స్ పాజిటివ్ లక్షణాలతోనే మృతి చెందినట్టు బయటపడిందని కేరళ వైద్య ఆరోగ్యమంత్రి వీణాజార్జి వెల్లడించారు. యువకుడైన ఆ వ్యక్తికి ఇతర వ్యాధులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ లేవని చెప్పారు. జులై 22న అరబ్ ఎమిరేట్స్ నుంచి ఆ యువకుడు వచ్చాడని, జులై 26న జ్వరం బాగా వచ్చిన సమయంలో తన కుటుంబం తోనే ఉన్నాడని, జులై 27న ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడని మంత్రి తెలిపారు. జులై 28న వెంటిలేటర్ అమర్చవలసి వచ్చిందని చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మంకీపాక్స్‌కు జులై 19న పరీక్ష చేయించుకున్నాడని అక్కడ పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఆ యువకుడు జులై 30న చనిపోయాడు. వైద్య ఆరోగ్య బృందాలు అక్కడికి వెళ్లి నమూనాలను సేకరించి ఎన్‌ఐవికి పంపారు. పరీక్షలో ఆ యువకుడు మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది.