- Advertisement -
హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారని మంత్రి తలసాని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రూ.600 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో హోమ్ మినిష్టర్ మొహమ్మద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సిపి సివి ఆనంద్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -