- Advertisement -
న్యూఢిల్లీ : భారత్‌మాల్దీవుల మధ్య పరస్పర సహకారాన్ని మరింత విస్తరింప చేసే ప్రాతిపదికపై మంగళవారం ఆరు కీలక ఒప్పందాలు జరిగాయి. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహిం మొహమెద్ సొలిహ్ తో విస్తృత చర్చలు జరిగిన తరువాత ప్రధాని మోడీ మాట్లాడుతూ పొరుగు దేశ మైన మాల్దీవుల్లో నిర్ణీత సమయానికి అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వీలుగా వంద మిలియన్ డాలర్ల సాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇంతే కాకుండా గ్రేటర్ మాలేలో 4000 సామాజిక గృహాల నిర్మాణాన్ని ఈరోజు సమీక్షించామని, దీనికి అదనంగా మరో 2000 గృహాల నిర్మాణానికి ఆర్థికంగా సహకరిస్తామని చెప్పారు. హిందూ మహా సముద్రంలో డ్రగ్ రవాణా, ఉగ్రవాదం తీవ్ర సమస్యలుగా ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావడం కీలకమని మోడీ వివరించారు.
- Advertisement -