Saturday, December 21, 2024

మూడో టి-20: విండీస్ పై గెలిచిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

Team India won on West Indies in Third T-20

 

సెయింట్ కిట్స్: వార్నర్ పార్క్ మైదానంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో టి-20లో భారత ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి భారత జట్టు ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సూర్యాకుమార్ యాదవ్ 44 బంతుల్లో 76 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బ్యాట్స్ మెన్లలో శ్రేయస్ అయ్యర్(24), రిషబ్ పంత్ (33) నాటౌట్, రోహిత్ శర్మ(11) రిటైర్డ్ హార్ట్, దీపక్ హుడా(10)నాటౌట్ పరుగులు చేశారు. 76 పరుగులు చేసిన సూర్యాకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. విండీస్ బౌలర్లలో డోమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, అకీల్ హోషన్ తలో ఒక వికెట్ తీశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా హర్ధిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ చెరో ఒక వికెట్ తీశాడు. ఐదు టి20 సిరీస్ లో భాగంగా 2-1 తేడాతో భారత జట్టు ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News