న్యూఢిల్లీ : ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు తీవ్ర ఆర్థిక సమస్యల్ని సృష్టిస్తున్నట్టు సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ , జస్టిస్ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. నీతి ఆయోగ్ , ఫైనాన్స్ కమిషన్, అధికార, విపక్ష పార్టీలు, ఆర్బీతోపాటు ఇతర సంస్థలతో అపెక్స్ బాడీని ఏర్పాటు చేసి, రాజకీయ పార్టీ ల ఉచిత హామీల నియంత్రణ గురించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పింది. ఉచితం ఎవరికి కావాలి, ఎవరు వాటిని వ్యతిరేకిస్తున్నారో తమ నిర్ణయాలను వెల్లడించాలన్నారు. ఆర్బీఐ, నీతి ఆయోగ్, విపక్ష పార్టీలు సమగ్రమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఉచిత హామీల నియంత్రణపై రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని , కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని కోర్టు కోరింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ , రాజకీయ పార్టీల ఉచిత హామీలు ఆర్థిక విధ్వంసానికి దారి తీస్తుందన్నారు.
ఉచిత హామీలతో తీవ్ర ఆర్థిక సమస్యలు : సుప్రీం కోర్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -