Monday, January 20, 2025

ఐసిసి టి20 ర్యాంకింగ్స్: సూర్యకుమార్‌కు రెండో ర్యాంక్..

- Advertisement -
- Advertisement -

ICC T20 Rankings: Surya Kumar Yadav climbs to 2nd spot

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. విండీస్‌తో జరిగిన మూడో టి20లో 76 పరుగులతో అదరగొట్టిన సూర్యకుమార్ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్2లో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ మూడు ర్యాంక్‌లను మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం 816 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 818 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇద్దరి మధ్య రెండు పాయింట్ల తేడా మాత్రమే ఉండడం విశేషం. విండీస్‌తో భారత్ మరో రెండు మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో సూర్యకుమార్ టాప్ ర్యాంక్‌ను అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక పాకిస్థాన్ ఆటగాడు రిజ్వాన్ మూడో, మార్‌క్రామ్ (సౌతాఫ్రికా) నాలుగో, డేవిడ్ మలన్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌లో నిలిచారు.

ICC T20 Rankings: Surya Kumar Yadav climbs to 2nd spot

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News