- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్‌లో లేదని తేల్చి చెప్పింది. 2019 జనవరిలో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశామని పేర్కొంది. ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ని విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 2020 ఫిబ్రవరిలో కర్నూలుకు మార్చాలని సిఎం ప్రతిపాదించారని కేంద్రం వెల్లడించింది. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ బదిలీ సంబంధిత హైకోర్టుతో సంప్రదిస్తోందని ప్రకటించింది. హైకోర్టుతో సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చింది. హైకోర్టు నిర్వహణ ఖర్చు భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
- Advertisement -