Saturday, December 21, 2024

సెమీస్ కు చేరిన నిఖ‌త్ జ‌రీన్‌

- Advertisement -
- Advertisement -

Nikhat

బర్మింగ్ హామ్:  కామ‌న్వెల్త్ గేమ్స్‌లో భార‌త క్రీడాకారులు స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే భార‌త్ ఖాతాలో భారీగా ప‌త‌కాలు చేరాయి. తాజాగా ఆ జాబితాలోకి మ‌రో ప‌త‌కం ఖాయ‌మైపోయింది. తెలంగాణ‌కు చెందిన మ‌హిళా బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ 50 కిలోల విభాగంలో గురువారం జ‌రిగిన క్వార్ట‌ర్స్ ఫైన‌ల్ మ్యాచ్‌లో విన్న‌ర్‌గా నిలిచింది. ఇటీవ‌లే వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచిన నిఖ‌త్‌… కామ‌న్వెల్త్ గేమ్స్‌లోనూ స‌త్తా చాటుతోంది. ఇప్ప‌టికే వ‌రుస మ్యాచ్‌లు గెలుస్తూ క్వార్ట‌ర్ ఫైనల్స్ చేరిన జ‌రీన్‌ ప‌త‌కం ఖాయం అయ్యే మ్యాచ్‌లో వేల్స్‌కు చెందిన హెలెన్ జోన్స్‌ను మ‌ట్టి క‌రిపిచింది. దాంతో సెమీ ఫైన‌ల్ కు  చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News