Saturday, December 21, 2024

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rain in many parts of Hyderabad

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీలో వర్షం పడుతున్నది. కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, షేక్‌పేట, లక్డీకపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, సైదాబాద్, శంషాబాద్, సాతంరాయి, గగన్‌పహాడ్, తండుపల్లి ప్రాంతాల్లో వాన కురుస్తున్నది. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీయగా.. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. ఇదిలా ఉండగా.. రాగల మూడు, నాలుగు గంటల్లో చాలా ప్రాంతాల్లో కొన్ని సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇవాళ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబాబాద్, ఖమ్మం, ములుగులో మోస్తరు వర్షాపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News