Monday, December 23, 2024

సినిమా పరిశ్రమకు థియేటరే గుడి: ప్రభాస్

- Advertisement -
- Advertisement -

Prabhas Speech at 'Sita Ramam' Pre Release Event

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ’సీతారామం’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా ఈ ఈవెంట్ లో పాల్గొని మాట్లాడుతూ.. “దుల్కర్ సల్మాన్ హ్యాండ్‌సమ్ హీరో, సూపర్ స్టార్. ‘మహానటి’ లాంటి గ్రేట్ ఫిల్మ్‌లో చేశారు. మృణాల్ చాలా అందంగా కనిపిస్తున్నారు. అలాగే రష్మిక డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తున్నారు. ఒక ప్రేమ కథని ఇంత భారీగా తీయడం మామూలు విషయం కాదు. స్వప్న లాంటి ప్యాషన్ వున్న నిర్మాతతోనే ఇది సాధ్యపడుతుంది. హను అద్భుతమైన దర్శకుడు. ’సీతారామం’ థియేటర్‌లో చూడాల్సిన సినిమా. ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్ళడం మానేస్తామా? మా సినిమా పరిశ్రమకు థియేటరే గుడి. భారీ బడ్జెట్, గొప్ప నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ చిత్రాన్ని ఖచ్చితంగా అందరూ థియేటర్‌లోనే చూడాలి” అని అన్నారు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “నాకు ‘సీతారామం’ గ్రేట్ జర్నీ. హను రాఘవపూడి గొప్ప ప్యాషన్ వున్న దర్శకుడు. సీతారామం అనే గొప్ప కల కన్నారు. ఆ కలలో నన్ను భాగం చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు” అని తెలిపారు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ “ఈ సినిమా క్రిడిట్ అంతా స్వప్నకి దక్కుతుంది. రామ్ పాత్ర కోసం అన్వేషణ చేస్తున్నపుడు దుల్కర్ అయితే అద్భుతంగా వుంటుందని స్వప్న చెప్పారు. మృణాల్ పేరుని నాగ్ అశ్విన్… స్వప్నకి చెప్పారు. అలా సీత దొరికింది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి చేసిన సంగీతం చిరకాలం నిలిచిపోతుంది”అని తెలియజేశారు. నిర్మాత స్వప్న మాట్లాడుతూ “హను వండర్‌ఫుల్ ఫిలిం మేకర్. దుల్కర్, మృణాల్, సుమంత్, రష్మిక.. అందరికీ థాంక్స్. ఇలాంటి సినిమాలు తీయడం మామూలు విషయం కాదు. నాన్నగారి వల్లనే ఇది సాధ్యమైంది”అని పేర్కొన్నారు. నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ “స్వప్న సింగల్ హ్యాండ్‌తో ‘సీతారామం’ను చాలా చాకచక్యంగా నడిపింది. స్వప్నకి హ్యాట్సప్. ఓ సీత కథతో ఇండస్ట్రీలోకి వచ్చిన నేను ఎప్పటికైనా మంచి ప్రేమకథ తీయాలని కోరుకునే వాడిని. ‘సీతారామం’తో ఆ కోరిక తీరింది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మృణాల్ ఠాకూర్, సుమంత్, నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Prabhas Speech at ‘Sita Ramam’ Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News