కరీంనగర్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ నేత, టిపిసిసి అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. గురువారం స్థానిక చొప్పదండి పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేశారు. కన్నతల్లి లాంటి సోనియాగాంధీని అవమానిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
- Advertisement -