ఉనికి.. వ్యాప్తి
l అక్షాంశములు, రేఖాంశాలు ద్వారా ఒక స్థలం ఉనికిని తెలుసుకోవచ్చు.
l భారతదేశం 8 డిగ్రీల 4 యూనిట్స్ ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 యూనిట్స్ ఉత్తర అక్షాంశం, 68 డిగ్రీల 7 యూనిట్ల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 యూనిట్స్ తూర్పు రేఖాంశం వరకు విస్తరిచి ఉంది.
l 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశరేఖ అయిన కర్కాటకరేఖ భారతదేశం మధ్యభాగం గుండా పోతుంది.
l ఈ కర్కాటకరేఖ దేశంను ఉష్ణమండల సమశీతోష్ణ మండలం అను రెండు సమ అర్ధ భాగాలుగా విభజిస్తుంది.
భారతదేశం ఒక ఉపఖండం
l ప్రత్యేకమైన ఖండాంతర లక్షణాలు ఉండటం వలన భారతదేశాన్ని ఉపఖండంగా భావిస్తారు.
l ఉపఖండం ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటుంది. అవి
l విభిన్న నైసర్గిక స్వరూపాలు
l శీతోష్ణ పరిస్థితులు
l సహజ వృక్షజాలం
l సాంస్కృత అంశాలు
l ప్రాచీన జాతులు, విభిన్న భాషా సమూహాలు, సువిశాలమైన భూమి
32,87,263 చ.కి.మీ విస్తీర్ణం
l భారతదేశం ఉత్తరాన కాశ్మీరు నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు సుమారు 3,124 కి.మీ..పశ్చిమాన గుజరాత్ నుండి ఈశాన్యమున అరుణాచల్ ప్రదేశ్ వరకు సుమారు 2,933 కి.మీ విస్తిరించింది.
l భారతదేశ తీరరేఖ పోడవు ప్రధాన భూభాగంతో పాటు లక్షదీవులు, అండమాన్ నికోబార్ కలుపుకుని 7,516 కి.మీ ఉంది.
l భారతదేశం సూయజ్ కాలువ ద్వారా ఐరోపాతో పాటు చైనా, జపాన్, ఆస్ట్రేలియాను మలక్కా జలసంధి ద్వారా వ్యాపార, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలకు అనుకూలంగా ఉంది.
భారతదేశ పరిమాణం
l ఆసియాలో భారతదేశం రెండవ పెద్ద దేశం. ఇది పాకిస్థాన్ కంటే 4 రెట్లు పెద్దది కానీ యూఎస్‌ఏ కంటే 3 రెట్లు చిన్నది.
భారత ప్రామాణిక కాలం
l ఒక ప్రాంతానికి చెందిన కాలాన్ని గణించుటకు రేఖాంశం ఉపయోగపడుతుంది.
l అలహాబాద్‌కు సమీపాన భారతదేశానికి మధ్యగా పోవుచున్న 82డిగ్రీల 30 యూనిట్స్ రేఖాంశం భారత ప్రామాణిక కాలరేఖగా పరిగణిస్తారు.
l ఇది గ్రీన్‌విచ్ ప్రామాణిక కాలం (0 డిగ్రీ రేఖాంశం)నకు 5 గంటల 30 నిమిషాలు ముందంజలో ఉంటుంది.
l స్వాతంత్య్రం తర్వాత భారత ప్రభుత్వం ఐఎస్‌టి ని అధికారిక కాలంగా ప్రకటించింది.
l దక్షిణాన భారతదేశం, శ్రీలంకను పాక్ జలసంధి వేరు చేస్తుంది.
l హిమాలయాలు భారతదేశానికి ఉత్తరాన సహజ సరిహద్దుగా ఉన్నాయి.
l తూర్పున గల అరకన్‌యోమా పర్వత శ్రేణులు భారతదేశాన్ని మయన్మార్ నుండి వేరు చేస్తున్నాయి.
భారత్‌కు సరిహద్దుగా గల దేశాలు
l పశ్చిమాన పాకిస్థాన్
l ఉత్తారన ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, భూటాన్, చైనా
l తూర్పున బంగ్లాదేశ్, మయన్మార్
సముద్రాలు
l దక్షిణాన హిందు మహాసముద్రం
l తూర్పు, ఆగ్నేయాన బంగాళఖాతం
l పశ్చిమాన అరేబియా సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి.
ప్రపంచంలో ఎత్తైన శిఖరం
l ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనది.
l ఇది హిమాలయ పర్వతాలలో నేపాల్, చైనా సరిహద్దులలో ఉంది.
l దీని ఎత్తు సముద్రమట్టం నుండి 8848 మీటర్లు.
l శీతోష్ణస్థితి ఉష్ణమండలం నుండి సమశీతోష్ణ మండలంలో మారుతుంది.
l మేఘాలయలో గల చిరపుంజి అధిక వర్షపాతం, థార్ ఎడారి చాలా తక్కువ వర్షపాతం పొందుచున్నవి.
l పశ్చిమ కనుమలలో తేమగల దట్టమైన ఉష్ణమండల అరణ్యాలు, ప.బెంగాల్‌లో బురదతో కూడిన చిత్తడి నేల అరణ్యాలు (మాంగ్రోవర్ అరణ్యాలు), థార్ ఎడారిలో చిట్టడవులు, పొడి ప్రదేశ సహజ వృక్ష జాలాన్ని కలిగి ఉన్నాయి.
l భౌగోళిక పర్యావరణం, శీతోష్ణస్థితి భారతదేశంను విభిన్న వృక్ష, జంతు జాతులు నివాసయోగ్య స్థానంగా ఏర్పరచుకున్నాయి.
భారతదేశ నైసర్గిక స్వరూపం
l ఒక దేశం భౌగోళికాంశాల గూర్చి వివరించటమే నైసర్గిక స్వరూపం అంటారు.
l భారతదేశం విభిన్న భౌగోళిక స్వరూపాన్ని కలిగి ఉంది.
l ద్వీపకల్ప పీఠభూమి కఠినమైన అగ్ని శిలలచే భూమిపై ఏర్పడిన ప్రాచీన పీఠభూమి.
భారతదేశ నైసర్గిక విభాగాలు
l భారతదేశ భూభాగం విభిన్న భౌగోళిక నిర్మాణాలను కలిగిఉంది.
l నిర్మాణం పరంగా భారతదేశం ఐదు నైసర్గిక విభాగాలుగా విభజించవచ్చు. అవి…
l ఉత్తర పర్వతాలు
l ఉత్తర విశాల మైదానాలు
l ద్వీపకల్ప పీఠభూమి
l తీర మైదానాలు, దీవులు
ఉత్తర పర్వతాలు
ఉత్తర పర్వతాలు గొప్ప పర్వత శ్రేణులు, అనేక శ్రేణులలో గల ఉపరితల ఏటవాలు ప్రాంతం ద్వారా శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉన్నాయి.
వీటినే హిమాలయాలు (హిమ నివాసము) అంటారు.
పశ్చిమం నుండి తూర్పు దిశగా 2,500 కి.మీ వరకు విస్తరించబడి ఉంది.
పశ్చిమాన జమ్ము కశ్మీరులో గల సింధులోయ నుండి తూర్పున అరుణాచల్ ప్రదేశ్‌లో గల బ్రహ్మపుత్రలోయ వరకు విస్తరించి ఉన్నాయి.
హిమాలయాల్లో అనేక శిఖరాలు సముద్రమట్టం నుండి 8000 మీటర్లకు పైగా ఎత్తును కలిగి ఉన్నాయి.
హిమాలయాల ఆవిర్భావం
హిమాలయాలు అనేక రకాలుగా పర్వత శ్రేణులుగా ఉండి లోయలు, పీఠభూములచే వేరు చేయబడి ఉన్నాయి.
అనేక మిలియన్ల ఏళ్ల పూర్వం భూ ఉపరితల భాగాన అతిపెద్ద భూభాగం ఉండేది.
ఈ భూభాగం అన్ని వైపుల సముద్రంచే ఆవరించబడి ఉంది.
ఈ భూభాగాన్ని పేంజియా అని అంటారు.
నీటిచే ఆవరించబడి ఉండే భూభాగాన్ని పెంథలాసా అని అంటారు.
ఈ పెద్ద భూభాగం రెండు భాగాలుగా విభజింపపడి ఉంది.
ఉత్తరార్ధ భాగాన గోండ్వానా భూభాగం అని అంటారు.
రెండు భూభాగాలను వేరు చేయు సముద్రాన్ని టెతిస్ సముద్రం అంటారు.
ఈ సముద్రం తూర్పు పశ్చిమ దిశ మీదుగా విస్తరించబడి ఉంది.
అంగారా, గోండ్వానా ప్రాంతంలోని నదులు శైథిల్య అవశేషాలను టెతిస్ సముద్రంలో నిక్షేపిస్తున్నాయి.
కాలక్రమేణా టెక్‌టానిక్ బాలల మధ్య నిక్షేపాలు పైకి నెట్టబడి ముడుత పర్వతాలు ఏర్పడ్డాయి. దీనినే హిమాలయ శ్రేణులు అంటారు.
హిమాలయాలు పశ్చిమం నుండి తూర్పు దిశగా మూడు ఉప విభాగాలుగా విభజించబడి ఉన్నాయి.
w 1. పశ్చిమ హిమాలయాలు
w 2. మధ్య హిమాలయాలు
w 3. తూర్పు హిమాలయాలు
పశ్చిమ హిమాలయాలను ట్రాన్స్ హిమాలయాలు అనికూడా అంటారు.
గంభీరమైన కారకోరమ్ పర్వతాలు పామీరు ముడి నుండి తూర్పుదిశగా విస్తరించి ఉన్నాయి.
గాడ్విన్ ఆస్టిన్‌ను కె2 (8,611మీటర్లు) అని కూడా అంటారు.
ఈ శ్రేణికి చెందిన కె2 ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శిఖరం.
ప్రస్తుతం కారకోరమ్ కనుమ, ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
కారకోరమ్‌కు దక్షిణాన బాల్‌తోరా, సియాచిన్ అను రెండు హిమనీ నదులు ఉన్నాయి.
ఇచ్చట లడక్, జస్కర్ అనబడే సమాంతర శ్రేణులున్నాయి.
లడక్ శ్రేణి విస్తీర్ణంను లడక్ పీఠభూమి అంటారు.
ఇది వాయువ్య కాశ్మీరులో ఉంది. ఇది భారతదేశంలోనే ఎత్తైన పీఠభూమి.