Friday, November 15, 2024

‘చికోటి’ని నాలుగవ రోజు ప్రశ్నించిన ఇడి

- Advertisement -
- Advertisement -

ED questioned Chikoti praveen on fourth day

లీగల్‌గా క్యాసినో నిర్వహించాను: చికోటి ప్రవీణ్
రాజకీయ, సినీ తారలతో పరిచయాలున్నాయి

హైదరాబాద్: క్యాసినో కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై నిందితుడు చికోటి ప్రవీణ్‌ను ఇడి ( నాలుగో రోజు) శుక్రవారం నాడు విచారించారు. ఈక్రమంలో గడచిన ఏడు నెలల కాలంలో క్యాసినో ఎజెంట్లు చీకోటి, మాధవరెడ్డిలు ఇప్పటి వరకు ఎన్ని టూర్‌లు నిర్వహించారు..? పంటర్లను తరలించినందుకు విమానాలకు వెచ్చించిన మొత్తాలపై ఆరా తీశారు. అంతేకాకుండా చీకోటి ప్రవీణ్ ఫోన్ డేటాలో ఉన్న కస్టమర్లు ఎవరెవరు ఎంత మొత్తాలు చెల్లించారు, విదేశాల్లోకి నగదు లావాదేవీలను హవాలా మార్గంలో ఎలా జరిపారన్న విషయాలపై నిందితులను వేర్వేరు గదులలో ఉంచి ప్రశ్నించారు. నిందితుల సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లలో ఉన్న తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులతో ఉన్న సన్నిహిత సంబంధాలపైనా ఇడి అధికారులు విచారించారు. క్యాసినో వేగస్ బై, బిగ్‌డాడి పేరిట పెద్దఎత్తున జరిగిన గ్యాంబ్లింగ్‌లో లావాదేవీలపై ఆరా తీశారు. క్యాసినో వ్యవహారంలో మాధవరెడ్డి, ప్రత్యేక విమానాలు సమకూర్చిన ఆరాధ్య టావెల్స్ అధినేత సంపత్‌లను ఒకచోటకు చేర్చి ఇడి ప్రశ్నించినట్లు తెలియవచ్చింది.

నాలుగవ రోజు విచారణ అనంతరం మరికొందరికి ఇడి అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇడి అధికారుల విచారణ ముగిసిన అనంతరం చికోటి మీడియాతో మాట్లాడుతూ విచారణలో ఇడి అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని, తాను లీగల్‌గా క్యాసినో నిర్వహించా అందులో తప్పేముందని తేల్చిచెప్పాడు. తనకు ప్రాణహాని ఉందని అందుకే రక్షణ కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి తప్పుడు పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనికి సంబంధించి సిసిఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు చీకోటి తెలిపారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఇకపై కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానన్నారు. క్యాసినో నిర్వహించా అందులో తప్పేముందని, తనకు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది రాజకీయలతో పాటు సినీ ప్రముఖులతోనూ పరిచయాలు ఉన్నాయన్నారు. నాలుగు రోజులుగా ఇడి అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని, ఇడి విచారణ పూర్తయ్యాక అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తానని చీకోటి ప్రవీణ్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News