- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో సాధారణ ప్రసవాలను ప్రోత్సాహించేందుకు వైద్యసిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసవాల్లో శస్త్రచికిత్సలను తగ్గించేందుకు సాధారణ ప్రసవాలను ప్రోత్సాహించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే ప్రతి సాధారణ ప్రసవానికి రూ.3 వేలు వైద్యబృందానికి అందజేయనున్నారు. గైనకాలజిస్టులు/వైద్యాధికారులకు రూ.1000, స్టాఫ్ నర్సులకు రూ.1000, ఆయా/ పారిశుద్ధ్య కార్మికులు రూ.500లు ఇవ్వనున్నారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో ఉండే సబ్ సెంటర్ ఎఎన్‌ఎంలకు రూ.250, ఆశాకార్యకర్తలకు రూ.250లు ఇవ్వనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి ఈ నిధులను వినియోగించనున్నారు.
- Advertisement -