Friday, November 22, 2024

తిరిగి రేసులోకి మరింత బలంగా సునాక్

- Advertisement -
- Advertisement -

Rishi Sunak wins over Liz Truss in a TV debate

టీవీ డిబేట్‌లో ట్రస్ ఓటమి
విజేతను తేల్చిన ఆర్థిక అంశాలు
ద్రవ్యోల్బణం, పన్నుల జటిలతలు
బేరీజు వేసుకుని రిషి విశ్లేషణ
వాదనలపై ఓటింగ్‌లో గెలుపు

లండన్ : బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ దశలో కీలకమైన టీవీ చర్చలో రిషి సునాక్ తమ అత్యంత సమీప, ఏకైక ప్రత్యర్థి లిజ్ ట్రస్‌పై విజయం సాధించారు. కన్సర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నిక తద్వారా దేశ ప్రధాని పదవి పగ్గాలు చేపట్టడం ఇప్పుడు బ్రిటన్‌లో రేస్ స్థాయిలో సాగుతోంది. భారతీయ సంతతి పూర్వపు మూలాలు ఉన్న సునాక్ పోటీలో వెనుకబడ్డట్లు, ట్రస్ ఆయనను అధిగమిస్తున్నట్లు పలు సర్వేలలో వెల్లడి తరువాతి దశలో ఈ టీవీ డిబేట్‌లో సునాక్ అనూహ్య విజయం దక్కించుకున్నారు. స్కై న్యూస్ టీవీలో ది బ్యాటిల్ ఫర్ నెంబరు 10 పేరిట చర్చ జరిగింది. దేశ అంతర్జాతీయ పరిణామాలు, పరిస్థితిని అదుపులోకి పెట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అని ప్రజల నుంచి వెలువడ్డ ప్రశ్నలపై సరైన సమగ్రమైన జవాబులు పోటీదార్లు చెప్పాల్సి ఉంది. రేస్‌లో మిగిలిన ఇద్దరి మధ్య ముఖాముఖి చర్చ నిర్వహించారు.

ఇది ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ప్రధాని అధికార పీఠం 10 డ్రౌనింగ్ స్రీట్‌లో పాగా వేసేందుకు అవసరం అయిన సమర్థత తమకు ఉందని చెప్పడానికి ఇరువురు అభ్యర్థులు నేనంటే నేనే తరహాలో పోటీ పడ్డారు. బోరిస్ జాన్సన్ తరువాతి ఖాళీ స్థానాన్ని భర్తీ చేసేందుకు తమకు అన్ని విధాలుగా అర్హత ఉందని తెలియచేసుకున్నారు. పలు ఒపినియన్ పోల్స్‌లో వెనుకబడ్డ సునాక్‌కు ఇప్పటి టీవీ డిబేట్ గెలుపు చాలా కలిసి వచ్చింది. చర్చలో ప్రజెంటర్ల ప్రశ్నలకు ట్రస్ తడబడటం, అసహనంతో సమాధానాలు ఇవ్వడం, అంతకు ముందటి తమ ప్రకటనలపై సరైన వివరణలు ఇవ్వలేకపోవడం వంటివి ఇబ్బందిగా మారాయి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకుల్లో ఓటింగ్ నిర్వహించారు. ఇందులో అత్యధికులు సునాక్ సరైన విధంగా స్పందించారని స్పందించడంతో ఆయనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని పేర్కొంటూ ఈ రేస్‌లో ఆయనను విజేతగా నిర్థారించారు. టోరీ సభ్యులు ఇటీవలి కాలంలో క్రమేపీ ట్రస్ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. అనూహ్య రీతిలో ట్రస్ సునాక్‌ను దూసుకుంటూ ముందుకు వెళ్లడం కీలక పరిణామం అయింది. దీనిని నివారిస్తూ ఇప్పుడు సునాక్‌ను రేస్‌లో తిరిగి ట్రాక్‌లో పెట్టేలా చేసేందుకు ఈ టీవీ డిబేట్ పనికి వచ్చింది.

పన్నుల అంశం తరువాత ..ముందు కట్టడి

ఇరువురు అభ్యర్థులకు ఆడియన్స్ నుంచి ప్రధానంగా ద్రవ్బోల్బణం, పన్నుల విషయాల గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. ద్రవ్యోల్బణం నియంత్రణ కీలక అంశం. తరువాత పన్నుల విధింపుల గురించి ఆలోచించవచ్చు. ద్రవ్యోల్బణంతో మార్టిగేజ్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. దీనితో పౌరుల సేవింగ్స్ , ఫించన్లకు ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. ట్రస్ తమ వాదనలో ముందు పన్నుల విధింపు భయాలతోనే ఆర్థిక మాంద్యాలు వస్తాయి. దీనిపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. దీనితో సునాక్ విభేదించారు. ద్రవ్యోల్బణంతోనే అన్ని సమస్యలు తలెత్తుతాయన్నారు. దీనిపై టీవీ ప్రశ్నా కార్యక్రమాల నిర్వాహకులు ఓటింగ్‌కు దిగగా సునాక్ వాదనకు పలువురు మద్దతు ప్రకటించారు. ఇప్పటి పోలింగ్ లెక్కల క్రమంలో పోటీ నుంచి వైదొలుగుతారా? అని సునాక్‌ను ఓ వ్యక్తి ప్రశ్నించారు. వెంటనే సునాక్ లేదన్నారు. పోరాటాన్ని తాను నమ్ముకున్నానని, తుది వరకూ ఇదే తంతుతో ఉంటానని తెలిపారు. తాను నిజంగా నమ్ముకున్న అంశాల కోసం సాగిస్తున్న పోరులో వెనుకంజ ప్రసక్తే లేదన్నారు. దేశ వ్యాప్తంగా తన ఆలోచనలను తీసుకువెళ్లుతున్నానని తెలిపారు. ప్రచార ఘట్టం తుది రోజు చివరి క్షణం వరకూ తన వాదనలు సాగుతాయని వెనుకంజ ప్రసక్తే లేదన్నారు.

ట్రస్ అసహనం చివరికి ఓటమి

ప్రభుత్వ ఉద్యోగులను తీసివేస్తే ఆదా జరుగుతుందని ట్రస్ అంతకు ముందు చెప్పడం తరువాత దీనిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం చర్చలో ప్రస్తావనకు వచ్చింది. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ట్రస్ చెప్పడంతో ప్రజెంటర్ స్పందిస్తూ సమర్థ నేతలు తప్పులు ఒప్పుకుంటారా? లేక ఇతరులపై నిందలు వేస్తారా? అని ప్రశ్నించగా ట్రస్ అసహనం ఇతర అంశాలు టీవీ డిబేట్ దశలో ఆమెకు ప్రతికూలతను తెచ్చిపెట్టాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News