Monday, December 23, 2024

హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

police raids on hookah center hyderabad

హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ లో హుక్కా సెంటర్ పై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఉత్తర మండల టాస్క్ ఫోర్స్, అబిడ్స్ పోలీసులు సంయుక్త దాడులు జరిపారు. ఎండి బదార్, ఎండి షోయబ్ తో పాటు ఆరుగురు కస్టమర్లను అరెస్ట్ చేశారు. హుక్కా సెంటర్ నిర్వాహకుడు అబిబ్ అహ్మద్ పరారీలో ఉన్నట్లు సమాచారం. హుక్కా సెంటర్ నిర్వహకుడిని గతంలోనూ ఇదే కేసులో అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. బెయిల్ పై బయటికొచ్చి అహ్మద్ మళ్లీ హుక్కా సెంటర్ నిర్వాహిస్తున్నాడని తెలిపారు. హుక్కా సేవిస్తూ పట్టుబడిన వారిలో వారందరూ మైనర్లుగా గుర్తించారు. ఇద్దరికి రిమాండ్ తరలించిన పోలీసులు మిగితా వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News