- Advertisement -
తైపే : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్, చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా ఆ ద్వీప దేశం చుట్టూ చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తైవాన్ రక్షణ శాఖకు చెందిన రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్ డిప్యూటీ హెడ్ ఒయు యాంగ్ లిహిసింగ్ అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు. దక్షిణ తైవాన్ లోని ఓ హోటల్‌లో శనివారం ఉదయం ఆయన విగత జీవిగా కన్పించారు. ఆయన మృతికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. యాంగ్ తైవాన్ క్షిపణి అభివృద్ది బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.
- Advertisement -