Saturday, December 21, 2024

నేతన్న బీమా నేడు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Nethanna Bima starts today

14నుంచి అమల్లోకి పథకం
60ఏళ్లలోపు వారికి వర్తింపు

మన హైదరాబాద్: రాష్ట్ర ప్రభు త్వం అమలు చేయనున్న నేతన్న బీమా పథకాన్ని జాతీ య చేనేత దినోత్సవం పురస్కరించుకొని పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ఈ ప థకాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు. ఈ నెల 14 ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. చేనే త, మరమగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులకు సంక్షేమ పథకాలతో పాటు వారి మరణానంతరం, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా తరహా ఈ పథకం అమలు చేయనున్నది. ఈ ఏడాది ఏప్రిల్ 27న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నేతన్న బీమాకు మార్గదర్శకాలను రూపొందించారు. ఈ పథకంలో లబ్ధి పొందే దరఖాస్తుదారుడు, జియోటాగింగ్ జరిగిన మరమగ్గాలపై నేత కార్మికుడై ఉండాలి. తప్పనిసరిగా రాష్ట్రం లో శాశ్వత నివాసం కలిగి వయస్సు 60 ఏళ్ల లోపు ఉండాలి. ఈ పథకాన్ని ఎల్‌ఐసి ద్వారా అమలు చేయనున్నారు. ప్రీమియం మొత్తం ప్రభు త్వం చెల్లిస్తోంది. బీమా కాలంలో లబ్ధిదారుడు మృ తి చెందితే నామినీ ఖాతాకు రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News