Sunday, April 6, 2025

నకిలీ పత్రాలతో బ్యాంక్‌కు బురిడీ

- Advertisement -
- Advertisement -

Bank fraud with forged documents

రూ.1.30కోట్ల రుణం తీసుకున్న నిందితులు
సిసిఎస్‌లో ఫిర్యాదు చేసిన బ్యాంక్ ప్రతినిధులు

హైదరాబాద్: నకిలీ పత్రాలతో బ్యాంక్ నుంచి రుణం తీసుకుని మోసం చేసిన వారిపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం… కొందరు వ్యక్తులు భూమి నకిలీ పత్రాలు తయారు చేసి ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని మోసం చేశారు. నకిలీ పత్రాలు తయారు చేసిన నిందితులు నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి రూ.1.30కోట్ల రుణం తీసుకున్నారు. రుణం ఇచ్చిన తర్వాత బ్యాంక్ అధికారులు నిందితులు తనఖా పెట్టిన పత్రాలను పరిశీలించగా నకిలీ పత్రాలుగా నిర్ధారించారు. నకిలీ పత్రాలు సమర్పించి రుణం తీసుకుని మోసం చేశారని గ్రహించిన బ్యాంక్ అధికారులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News