Monday, December 23, 2024

తెలంగాణ వ్యవసాయం

- Advertisement -
- Advertisement -

Telangana agriculture questions and answers

పోటీ పరీక్షల్లో వ్యవసాయం చాప్టర్ నుంచి దాదాపు 3 నుంచి 7 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు 33 జిల్లాలతో కూడిన సమాచారం సమగ్రంగా దొరుకుతుంది. ఈ చాప్టర్ చాలా సులువుగా ప్రిపరేషన్ చేయవచ్చు. సులభంగా అర్థం చేసుకొని మంచి మార్కులు సాధించవచ్చు. వ్యవసాయం అంశం సులువుగా ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం మాత్రం గుర్తించడం కష్టంగా ఉంది. ఎందుకంటే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం పంటలను ఖరీఫ్, రబీ కాకుండా, వానాకాలం, యాసంగి మొత్తం పేరుతో డేటాను ప్రచురించింది. దీని వల్ల ఏమైందంటే డేటాలో వానాకాలం, యాసంగి మొత్తం అనే మూడు అంశాలను గమనించి గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయం చాప్టర్ చదవడానికి సులువుగా ఉన్నా ప్రశ్నలు మాత్రం కఠినంగానే ఉండే అవకాశం ఉంది.
రాష్ట్రాల వారిగా పంటలకు సంబంధించిన డేటా 201920వ ఏడాదికి సంబంధించినవి తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 201920 ఏడాదితో పోల్చి, భారతదేశంలో తెలంగాణ స్థానం ఎంత అని ధృవీకరిస్తుంది. రాష్ట్రాల వారిగా చూస్తే అత్యధికం, అత్యల్పం, ర్యాంకు ..అంటే 201920వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిందని అర్థం.
తెలంగాణలో వ్యవసాయ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాంటిది.
వ్యవసాయరంగం 4 ముఖ్యమైన ఉపరంగాలు ఉంటాయి. అవి
పంటలు, పశుపోషణ, అడవులు..లాగింగ్, ఫిషింగ్ & ఆక్వాకల్చర్.
తెలంగాణలో దాదాపు 55% ప్రజలకు ముఖ్యమైన జీవన ఆధారం వ్యవసాయ రంగమే.
2014 15 వరకు 202021 మద్య కాలంలో తెంలగాణ రాష్ట్రంలో మొత్తం వాల్యూ యాడెడ్ 142% పెరిగింది.
సాధారణంగా పంటలను పరిగణనలోకి తీసుకున్న ప్పుడు మూడు అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. అవి వైశాల్యం (ఎకరాల్లో), దిగుబడి (ఎకరానికి ఎన్నికేజీలు), ఉత్పత్తి (టన్నుల్లో).
w జిల్లాలవారిగా పంటలకు సంబంధించిన డేటా 202021వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఇదే ప్రభుత్వం దగ్గర ఉన్న తాజా సమాచారం. అందుకే జిల్లాల వారీగా చూసినప్పుడు అత్యధికం, అత్యల్పం అంటే 2020 21వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదని అర్థం.
పత్తి పంట..
అత్యధికంగా పత్తిపంట విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా నల్లగొండ.
అత్యధికంగా పత్తి దిగుబడి రాజన్న సిరిసిల్ల.
వరి ఉత్పత్తి..

అత్యధికంగా వరి ఉత్పత్తి నల్లగొండ
అత్యధికంగా వరిపంట వైశాల్యం గల జిల్లా నల్లగొండ జిల్లా
అత్యధికంగా వరిపంట దిగుబడి గల జిల్లా నిజామాబాద్.
వానాకాలంలో అత్యధికంగా వరి పంటను దిగుబడి చేస్తున్న జిల్లా నిజామాబాద్.
వానాకాలంలో అత్యధికంగా వరిపంటను ఉత్పత్తి చేస్తున్న జిల్లా నిజామాబాద్.
వానాకాలంలో అత్యధికంగా వరి విస్తీర్ణం గల జిల్లా సూర్యాపేట.
యసంగి కాలంలో అత్యధికంగా వరి పంట విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా నల్లగొండ.
యాసంగి కాలంలో అత్యధికంగా వరిపంట దిగుబడి గల జిల్లా కామారెడ్డి.
మొక్కజొన్న సాగు..
అత్యధికంగా మొక్కజొన్నపంట విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా వరంగల్.
అత్యధికంగా మొక్కజొన్న పంట విస్తీర్ణం గల జిల్లా ఖమ్మం.
వానాకాలంలో అత్యధికంగా మొక్కజొన్న విస్తీర్ణం గల జిల్లా కామారెడ్డి.
వానాకాలంలో అత్యధికంగా మొక్కజొన్న దిగుబడి గల జిల్లా హన్మకొండ.
వానాకాలంలో అత్యధికంగా మొక్కజొన్న ఉత్పత్తి గల జిల్లా జగిత్యాల.
యాసంగి కాలంలో అత్యధికంగా మొక్కెజొన్న విస్తీర్ణంగల, ఉత్పత్తి చేస్తున్న జిల్లా వరంగల్.
యాసంగి కాలంలో అత్యధికంగా మొక్కజొన్న దిగుబడి గల జిల్లా నిర్మల్.
కంది పంట..
అత్యధికంగా కందిపంట విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా వికారాబాద్.
అత్యధికంగా కంది దిగుబడి గల జిల్లా నిజామాబాద్.
యాసంగిలో అత్యధికంగా కంది విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా జోగులాంబ గద్వాల.
యాసంగి కాలంలో అత్యధికంగా కంది దిగుబడి గల జిల్లా నిజామాబాద్.

సోయాబీన్ ఉత్పత్తి..

w అత్యధికంగా సోయాబీన్ విస్తీర్ణంగల జిల్లా కామారెడ్డి
w అత్యధికంగా సోయాబీన్ ఉత్పత్తి చేస్తున్నజిల్లా నిజామాబాద్.
w అత్యధికంగా సోయాబీన్‌ను దిగుబడి చేస్తున్న జిల్లా నిజామాబాద్.
వేరుశనగ సాగు..
w అత్యధికంగా వేరుశనగ విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా నాగర్ కర్నూల్.
w అత్యధికంగా వేరుశనగ దిగుబడి గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం.
w వానాకాలంలో అత్యధికంగా వేరుశనగ విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా జోగులాంబ గద్వాల.
w వనాకాలంలో అత్యధికంగా వేరుశనగ దిగుబడి గల జిల్లా వరంగల్.
w యాసంగి కాలంలో అత్యధికంగా వేరుశనగ విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా నాగర్‌కర్నూల్.
w యాసంగి కాలంలో అత్యధికంగా వేరుశనగ దిగుబడి గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం.

టమాటాలు..
w అత్యధికంగా టమాటాల విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా రంగారెడ్డి.
ఉల్లిగడ్డ
w అత్యధికంగా ఉల్లిగడ్డల విస్తీర్ణం,ఉత్పత్తి చేస్తున్న జిల్లా జోగులాంబ గద్వాల.
జామ
w అత్యధికంగా జామ విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా రంగారెడ్డి.
పసుపు
w అత్యధికంగా పసుపు విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా నిజామాబాద్.
మామిడి
w అత్యధికంగా మామిడి విస్తీర్ణం, ఉత్పత్తి గల జిల్లా జగిత్యాల.
పుచ్చకాయ
w అత్యధికంగా పుచ్చకాయ విస్తీర్ణం, ఉత్పత్తి గల జిల్లా వరంగల్.
స్వీట్ ఆరెంజ్
w అత్యధికంగా స్వీట్ ఆరెంజ్ విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న జిల్లా నల్లగొండ.

భారతదేశంలో పంటలు

వరి సాగు..
w విస్తీర్ణంలో తెలంగాణ దేశంలో 10వ స్థానంలో ఉంది.
w విస్తీర్ణంలో ఉత్తరప్రదేశ్ దేలంలో మొదటి స్థానంలో ఉంది.
w ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్ రాష్ట్రం.. దేశంలో మొదటి స్థానంలో ఉంది.
w వానాకాలంలో అత్యధికంగా వరి విస్తీర్ణం, ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
w వానాకాలంలో వరి విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రం 14వ స్థానంలో ఉంది.
w వానాకాలంలో వరి దిగుబడిలో చం డిఘర్ దేశంలో మొదటి స్థానంలో ఉంది.
w యాసంగి కాలంలో వరి విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉంది.
w యాసంగిలో వరి దిగుబడిలో తమిళనాడు రాష్ట్రం దేశంలో తొలి స్థానంలో ఉంది.
కంది సాగు..
w వానాకాలంలో కంది విస్తీర్ణంలో తెలంగాణకు దేశంలో మూడో స్థానం.
w వానాకాలంలో కంది ఉత్పత్తిలో కర్నాటక రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది.
w వానాకాలంలో కంది దిగుబడిలో బీహార్ రాష్ట్రం దేశంలో మొదటి స్థానం.

పృథ్వీకుమార్ చౌహన్
డైరెక్టర్, పృథ్వీస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News