Tuesday, December 24, 2024

ఇండో-ఫ్రెంచ్ ఫిలింఫెస్టివల్లో ‘మామనితన్’ సంచలనం

- Advertisement -
- Advertisement -

 

Maamanithan

ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న విజయ్ సేతుపతి
ఉత్తమ చిత్రం అవార్డూ కైవసం

చెన్నై: విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ ఎంటర్‌టైనర్ ‘మామనితన్’లో నటనకు గాను నటుడు విజయ్ సేతుపతి ఇండో-ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు శీను రామసామి.  ఈ చిత్రానికి ‘ఉత్తమ చిత్రం’ అవార్డు కూడా లభించింది. ఈ విషయాన్నిదర్శకుడు శీను రామసామి ట్విట్టర్‌లో తెలుపుతూ, “ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతికి, ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్నందుకు యువన్ శంకర్ రాజాకు అభినందనలు. ఇండో-ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

విడుదలైన వెంటనే వివిధ వర్గాల నుండి భారీ ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ప్రముఖ దర్శకుడు శంకర్ దీనిని ‘రియలిస్టిక్ క్లాసిక్’ అని పిలిచారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి అద్భుత నటనకు జాతీయ అవార్డు రావాలని శంకర్ అన్నారు.
వారం రోజుల క్రితమే, ఈ చిత్రం టోక్యో ఫిల్మ్ అవార్డ్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఉత్తమ ఆసియా చిత్రం విభాగంలో ‘మామనితన్’ స్వర్ణం గెలుచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News