Monday, December 23, 2024

నగరాన్ని వదలని ముసురు

- Advertisement -
- Advertisement -

Heavy Rain Hits Hyderabad

హైదరాబాద్: నగరాన్ని వాన ముసురు కమ్మివేసింది. సోమవారం తెల్లవారు జాము నుంచి వాన ముసురు కొనసాగింది. నర వ్యాప్తంగా దపాలు దపాలుగా రోజంతా వర్షం పడింది. రోజంతా నగరాన్ని మబ్బులు అలుముకోవడంతో చిమ్మ చీకటి చోటు చేసుకుంది. నగరవాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తారు కురిసింది మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. వాన ముసురుతో నగరవాసలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులకు కష్టాలు తప్పలేదు.. శనివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడడం, అది మరింత బలపడి వాయు గుండంగా మారుతుండడంతో దాని ప్రభావంతో నగరంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుడా నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలను జారీ చేశారు.

దీంతో ఇప్పటీకే వరస భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులు మరింత హడలి పోతున్నారు. కాప్రా, కుత్భుల్లాపూర్, జగద్గీర్‌గుట్ట, మూసాపేట్, బొల్లారం, జీడిమెట్ల, గాజుల రామారం, నేరెడ్‌మెట్, హఫీజ్‌పేట్, షాపూర్‌నగర్, రామచంద్రాపురం, ఎ.ఎస్‌రావు నగర్, హైదర్‌నగర్, బాలాజీ నగర్, కుషాయిగూడ, మల్కాజ్‌గిరి, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, నాగోల్, ఎల్‌బినగర్, మలక్‌పేట్, కోఠి, నాంపల్లి, అంబర్‌పేట్, కాచిగూడ, హిమాయత్‌నగర్, నారాయణగూడ ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మెహిదిపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ,సనత్‌నగర్, బాలానగర్ తదితర ప్రాంతాలో వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News