న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్డ్ ఆంక్షలు విధించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై హెచ్చరికలు జారీ చేసింది. దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ విభాగం అలర్డ్ చేసింది. ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోట చుట్టూ 10,000 మందికి పైగా పోలీసులను మోహరిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ మొఘల్ నాటి స్మారక చిహ్నంపై నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎర్రకోట చుట్టూ ఎత్తైన భవనాలపై షార్ప్ షూటర్లను మోహరించారు. ఎర్రకోట చుట్టుపక్కల నో ఫ్లయింగ్ జోన్ అమలుచేశారు. గాలి పటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధం విధించారు. వెయ్యికి పైగా అత్యాధునిక సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులు మూసివేస్తున్నట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) దేపేంద్ర పాఠక్ అన్నారు..