- Advertisement -
చియాన్ విక్రమ్ కధానాయకుడిగా ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ‘కోబ్రా’ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు.
Cobra Movie to release on Aug 31st
- Advertisement -