Monday, December 23, 2024

ఫ్రీడమ్ పార్కును ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

minister harish rao inaugurated freedom park in siddipet

సిద్దిపేట: 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేట శివారు రంగనాయక సాగర్ లో ఫ్రీడమ్ పార్కు ను జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని, ఇవాళ హరిత వనోత్సవం పేరిట సిద్దిపేట పట్టణశివారు రంగనాయక సాగర్ వద్ద ఫ్రీడమ్ పార్కు ప్రారంభం చేసుకోవడం సంతోషకరమైన విషయంగా తెలిపారు.

దేశంలో చాలా చోట్ల జాతీయ జెండాలు కేంద్రం సరఫరా చేయలేక అందజేయలేక పోతున్నామని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గుచేటుగా, అవమానకరంగా ఉన్నాయని, ఇదేనా వజ్రోత్సవాలు జరుపుకునే తీరు, ఇదేనా జాతీయ జెండాకు మీరిచ్చే విలువ అంటూ.. కేంద్రం తీరును విమర్శించారు. మేకిన్ తెలంగాణ పేరిట తయారు చేసి ఇంటింటికీ ఇస్తున్నట్లు, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి 20 లక్షల జెండాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గాంధీ బాటలో ప్రపంచం నిడిచిందంటూ.. స్వాతంత్ర్య ఫలాలు పొంది ఎన్నో విజయాలు సాధించారని, కానీ గాంధీజీని అవమాన పరుస్తూ.. గాడ్సేను పొగిడే సంస్థలను తరిమికొట్టాలని, అలాంటి సంస్థల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి సంస్థల పై చర్యలు తోసుకోవడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భావి భారత పౌరులకు సినిమా టాకీసులలో దేశభక్తిని పెంపొందించేలా దేశభక్తి చాటేలా స్వాతంత్ర్య సమరయోధులు చిత్రాలను ప్రదర్శించి చూపుతున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ప్రతీ పౌరుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News