Monday, December 23, 2024

తైవాన్‌పై అవసరమైతే బలప్రయోగం తప్పదు: చైనా

- Advertisement -
- Advertisement -

China warns it will not tolerate Taiwan

బీజింగ్ : తైవాన్‌లో వేర్పాటు వాదాన్ని అసలు సహించమని బుధవారం చైనా పునరుద్ఘాటించింది. అవసరమైతే ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోడానికి బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. నాన్సీ పెలోసీ పర్యటన తరువాత తైవాన్ చుట్టుపక్కల భారీ ఎత్తున చైనా యుద్ధ విన్యాసాలు ప్రారంభించిన తరువాత ఈ ప్రకటన వెలువడింది చైనాకు చెందిన తైవాన్ అఫైర్స్ ఆఫీస్ ఈమేరకు శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ఆర్థిక తాయిలాలు ,సైనిక బలం సాయంతో తైవాన్‌ను ఏ విధంగా వశం చేసుకుంటామో దీనిలో స్పష్టంగా పేర్కొన్నారు. “ ప్రశాంతంగా విలీనం కావడానికి అవసరమైన అవకాశాలను కల్పిస్తాం. అదే సమయంలో ఏ విధమైన వేర్పాటు వాదానికి చోటు లేదు. బలప్రయోగ అవకాశాలను తోసిపుచ్చడం లేదు. విలీనానికి అవసరమైన ఏ చర్య తీసుకోడానికైనా ఆప్షన్‌ను సిద్ధంగా పెట్టుకొన్నాం. వేర్పాటు వాదులు, బాహ్య శక్తులు, లక్ష్మణ రేఖను దాటడమే … మేము కఠిన చర్యలు తీసుకొనేలా పురిగొల్పుతాయి” అని ఈ శ్వేత పత్రంలో పేర్కొన్నారు. చైనా చివరిసారిగా 2000 సంవత్సరంలో శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారీ సైనిక విన్యాసాల మధ్య మరోసారి ఈ పత్రాన్ని విడుదల చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News