Saturday, November 23, 2024

తొలిసారి స్పెషల్ క్యారెక్టర్ చేశా

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు)లో వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగచైతన్య నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చెడ్డా‘. హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో నాగచైతన్య బాలరాజుగా కీలక పాత్రలో అమీర్ ఖాన్‌తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు . తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా యువ హీరో అక్కినేని నాగచైతన్య మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఎంతో నేర్చుకున్నా…
ఈ సినిమాలో అమీర్ ఖాన్‌లాంటి వారితో కలసి నటించడం చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను. ఆయనతో నటించడం ద్వారా నేను ఎంతో నేర్చుకొన్నాను. ఈ చిత్రంలో నాది కేవలం 20 నుండి 30 నిమిషాల పాత్ర మాత్రమే. లాల్ (అమీర్ ఖాన్)తో కలిసి ఉంటుంది నా పాత్ర.
హ్యాపీగా అనిపించింది…
ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. సినిమాలో లాల్ పాత్రలో నటించిన అమీర్ కు ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి కనిపించకుండా అద్భుతంగా నటించాడు. బాలరాజు క్యారెక్టర్ నాకు స్పెషల్‌గా అనిపించింది. 1948లో తాతగారు ఈ టైటిల్ పేరుతో నటించిన చిత్రం సూపర్ హిట్ అయిందని నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
తెలుగు నేటివిటీ కనిపిస్తుంది…
గుంటూరు జిల్లాలోని బోడిపాలెం దగ్గర పుట్టిన బాలరాజు ఆర్మీలో చేరిన విధానం ఇందులో చాలా చక్కగా చూపించడం జరుగుతుంది.ఇందులో తెలుగు నేటివిటీ చాలావరకూ కనిపిస్తుంది. ఈ సినిమాను తెలుగు జిల్లాలలో కూడా షూటింగ్ చేయడం జరిగింది. ఇక చిరంజీవి ఈ సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది.
పిరియాడిక్ మూవీ కాదు…
‘వెంకీ మామ’లో నేను ఆర్మీ క్యారెక్టర్ చేసినా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ చిత్రంలో కార్గిల్‌లో జరిగిన ఒక సీన్‌ను తీసుకొని చేయడం జరిగింది.ఇందులో కార్గిల్ వార్ సీక్వెన్స్ ఉంటాయి. హిందీలో ఇది నా ఫస్ట్ డబ్ల్యు మూవీ ఇది. ఇది 1975 నుంచి తీసుకున్న సినిమా. కానీ పిరియాడిక్ మూవీ కాదు.
తొలిసారి స్పెషల్ క్యారెక్టర్‌లో…

నాకు స్పెషల్ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను తొలిసారి స్పెషల్ క్యారెక్టర్ చేశా. ఇక ముందు కూడా ఇలాంటి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను.

Naga Chaitanya Interview about ‘Lal Singh Chaddha’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News