Saturday, November 16, 2024

ఎంపి గోరంట్ల మాధవ్ ‘వీడియో’ ఫేక్

- Advertisement -
- Advertisement -

MP Gorantla Madhav 'video' is fake:SP Fakeerappa

మీడియా సమావేశంలో ఎస్‌పి వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని అనంతపురం ఎస్‌పి ఫకీరప్ప ప్రకటించారు. ఈ వ్యవహారంపై బుధవారం మధ్యాహ్నాం ఎస్‌పి ఫకీరప్ప మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వీడియోను చూస్తున్న విజువల్స్‌ను వీడియో తీసి పోస్ట్ చేశారని ఆయన వెల్లడించారు.

వీడియోను మార్ఫింగ్ చేసినట్లు ఎంపి అనుచరుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఐ.టిడిపి వాట్సాప్ గ్రూపులో మొదట వచ్చిందని, 4వ తేదీ అర్ధరాత్రి 2.07కు +447443703968 నంబర్ నుంచి పోస్ట్ చేశారన్నారు. యూకెలో రిజిస్టర్ అయిన నంబర్‌తో ఈ వీడియో అప్‌లోడ్ అయ్యిందని, ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఆ నంబర్ ఎవరిదో కనుక్కునే పనిలో ఉన్నామనిచ వీడియో ఫార్వర్డ్, రీపోస్ట్ చేయడం వల్ల అది ఒరిజినల్ అని గుర్తించలేకపోతున్నామని ఎస్‌పి స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేమని, అలాగే ఒరిజినల్ వీడియో దొరికే దాకా ఏం చెప్పలేమని ఎస్‌పి తేల్చి చెప్పారు.బాధితురాలు ఫిర్యాదు చేస్తే ఆమె నుంచి వీడియోను సేకరించి వెంటనే తేలుస్తామన్నారు.

కడిగిన ముత్యంలా బయటకు వస్తా : ఎంపి గోరంట్ల మాధవ్

న్యూడ్ వీడియో వ్యవహారంలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తనకు ముందే తెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపి గోరంట్ల మాధవ్ అన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియో వందశాతం ఫేక్ అని తాను గతంలోనే చెప్పానన్నారు. వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్‌పి ఫకీరప్ప వివరాలు వెల్లడించిన అనంతరం ఎంపి మాధవ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టెందుకే ఇలాంటి పనులు చేశారన్నారు. ఆ వీడియోను తాను పెద్దగా పట్టించుకోలేదని అది వైరల్ అయ్యాక కూడా తన పనులను చేసుకున్నానని తెలిపారు. వీడియోపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, అది సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News