Monday, December 23, 2024

‘సెస్‌’లో వాటాపై మౌనం

- Advertisement -
- Advertisement -

Modi government not responding on surcharges

పన్నుల ఆదాయంలో
రాష్ట్రాలకు వాటా
పంచిన కేంద్రం
తెలంగాణకు
రూ.2452 కోట్లు
సర్‌ఛార్జీలపై స్పందించని
మోడీ సర్కార్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రప్రభుత్వం దేశ ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న ఆదాయం రికార్డుస్థాయిలో ఖజానాకు చేరుతుండటంతో రాష్ట్రాలకు వాటా నిధులను విడుదల చేసింది. అయితే సెస్, సర్‌ఛార్జీలలో రాష్ట్రాలకు వాటా ఇచ్చే విషయంలో మాత్రం మౌనమే పాటించింది. ఈసారి పన్ను ఆదా యంలో ఒకేసారి రెండు ఇన్‌స్టాల్‌మెంట్‌ల నిధుల ను రాష్ట్రాలకు విడుదల చేసింది. దేశంలోని 28 రాష్ట్రాలకు 1,16, 665 కోట్ల 72 లక్షల రూ పాయల నిధులను కేంద్రం విడుదల చేసిం ది. సాధారణంగానైతే నెలకు 58,332 కోట్ల 86 లక్షల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన కేంద్రం రెండు నెలలకు కలిపి ఒకేసారి నిధులను విడుదల చేయడంతో రాష్ట్రాలకు ఆర్ధికంగా కాస్తంత ఊరట లభించినట్లయ్యిం ది. పన్నుల రూపంలో కేంద్రం వసూలు చేసే ఆదాయం నుంచి రాష్ట్రాలకు 41 శాతం నిధులను వాటాగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రానికి 2,452 కోట్ల 32 లక్షల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేసిం ది. గరిష్టంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు 20,928 కోట్ల 62 లక్షల రూపాయలు, బీహార్ రాష్ట్రానికి 11,734.22 కోట్లు, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 9,158.24 కోట్లు, మహారాష్ట్రకు 7,369.76 కోట్లు, రాజస్థాన్ రాష్ట్రానికి 7,030.28 కోట్లు, ఒడిషా రాష్ట్రానికి 5,282.62 కోట్ల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేసింది. అయితే సెస్, సర్‌చార్జీల రూపంలో కేంద్రం దేశ ప్రజల నుంచి వసూలు చేసిన 15,47,560 కోట్ల రూపాయల నిధుల్లో రాష్ట్రాలకు ఒక్క రూపాయిని కూడా వాటాగా ఇవ్వకుండా కేంద్రం మొండిచెయ్యి ఇచ్చింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత తీవ్రస్థాయిలో సెస్, సర్‌చార్జీల ఆదాయంలో కూడా వాటా నిధులు ఇవ్వాలని అడుగుతున్నా కేంద్రం ఇప్పటి వరకూ స్పందించలేదు.

సెస్, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకూ వాటా నిధులు ఇచ్చి సమాఖ్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటుగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా అనేక సార్లు కేంద్రాన్ని కోరారు. అంతేగాక ఈ రెండు రాష్ట్రాల ఎంపీలు కూడా పార్లమెంట్ సమావేశంలో అనేకసార్లు కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ కేంద్రం ఇప్పటి వరకూ సెస్, సర్‌చార్జీల ఆదాయంలో రాష్ట్రాలకూ వాటా నిధులు ఇస్తామనిగానీ, ఇవ్వమనిగానీ చెప్పలేదని, ఈ ప్రస్తావన వచ్చినపుడల్లా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖాధికారులు సమాధానాన్ని దాటవేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక శాఖలోని ఓ సీనియర్ అధికారి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News