- Advertisement -
అమరావతి: అల్లూరి జిల్లా హుకుం పేట మండలం తడిగిరిలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం రెండేళ్ల కూతురిని ఓ తల్లి హత్యచేసింది. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మతిస్థిమితం లేకపోవడమే ఈ దారుణానికి కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -