Wednesday, January 22, 2025

టీకాలకు కటకట

- Advertisement -
- Advertisement -

Covishield Vaccine Doses shortage in Telangana

రోజూ లక్షకు పైగా బూస్టర్ డోసుల పంపిణీ

ప్రస్తుతం అందుబాటులో 2.39లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు
రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం

మన : రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూ స్టర్‌డోసుకు డిమాండ్ పెరిగింది. అయితే కోవాక్సిన్, కోర్బివ్యాక్స్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ కొవిషీల్డ్ వ్యాక్సిన్ నిల్వలు తక్కువగా ఉన్నాయి. నిత్యం రాష్ట్రవ్యాప్తంగా రోజు దాదాపు లక్ష మందికి పైగా బూస్టర్ డోసులు పంపిణీ చేస్తునట్టు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గురువారం ఒక్క రోజే 1,20,320 మందికి బూస్టర్ డోసులు వేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 33,18,054 మంది బూస్టర్ డోసులు వేసుకోగా, 2,17,17,846 మందికి బూస్టర్ వేయాల్సి ఉంది. రాష్ట్రంలో గురువారం నాటికి 20,64,050 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉండగా, అందులో కొవిషీల్డ్ వ్యాక్సిన్లు 2,39,570 డోసులు, కోవాక్సిన్ 14,38,630 డోసులు, కోర్బివ్యాక్స్ 3,85,850 డోసులు అందుబాటులో ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం కొవిషీల్డ్ టీకా నిల్వలు తక్కువగా ఉన్నాయి. మొదటి నుంచి రాష్ట్రంలో కొవిషీల్డ్ టీకాలను అత్యధికంగా పంపిణీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు బూస్టర్ డోస్‌కు ఆటంకం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం నుంచి కోవిషీల్డ్ కొత్త డోసులు అందుబాటులోకి రాకపోతే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. టీకాల కొరతపై ఇప్పటికే కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి తక్షణమే 50 లక్షల కొవిషీల్డ్ డోసులు పంపాలని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుక్ మాండవీయకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో డిమాండ్ మేరకు ప్రతిరోజు 3 లక్షల డోసులు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నా.. వ్యాక్సిన్ కొరత వల్ల రోజుకు కేవలం 1.5 లక్షల డోసులు మాత్రమే ఇవ్వగలుగుతున్నట్టు కేంద్రానికి వివరించారు.

Covishield Vaccine Doses shortage in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News