- Advertisement -
రంగారెడ్డి: రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోదరుడు నరసింహ్మ రెడ్డి ఇంటికెళ్లి రాఖీ కట్టారు. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అక్కా-తమ్ముళ్ల, అన్న -చెల్లెళ్ళ వెల కట్టలేని ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ఈ పండుగ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఇంట సంతోషాలు వెల్లివిరిసే రక్ష బంధన్ ను కుటుంబసభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు జాతీయ సమైఖ్య రక్ష బంధన్ వేడుకల్లో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -