- Advertisement -
బెంగళూరు: ప్రముఖ కన్నడ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివమొగ్గ సుబ్బన్న నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన బెంగళూరులోని జయదేవ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సుబ్బన్న వయసు 83 సంవత్సరాలు. ఆయనకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ‘కాడు కుదురే’ చిత్రంలో ఆయన పాడిన పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. తన కెరీర్లో ఆయన ఎన్నో అవార్డులు, పురస్కారాలను అందుకున్నారు. గతంలో ఆయన అడ్వొకేట్ గా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
- Advertisement -