సిద్దిపేట పట్టణం అన్నింటిలో ముందే అని మరోసారి చాటిన పట్టణ ప్రజలు
ఫ్రీడమ్ ర్యాలీకి వాడ వాడల స్వతంత్రంగా తరలివచ్చిన ప్రజలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు
మంత్రి పిలుపు మేరకు భారీగా ర్యాలీలో పాల్గొన్న ప్రజలు
సిద్దిపేట: 75వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సిద్ధిపేట పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,శ్వేతా సిపి, ముజమ్మిల్ ఖాన్ (అడిషనల్ కలెక్టర్), మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు ,మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, పట్టణ ప్రజలు, విద్యార్థులు, యువకులు ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఫ్రీడమ్ రన్ లో భాగంగా 300 మీటర్ ల జాతీయ జెండాను వాడ వాడల ర్యాలీ తీస్తూ ప్రదర్శించడం జరిగింది. ఉదయాన్నే వాడ వాడల నుంచి వార్డు కౌన్సిలర్లు తమ వార్డుల నుంచి ర్యాలీగా బయల్దేరి మోడర్న్ బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ సర్కిల్ కి వచ్చి ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 75 వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల పై సందేశం ఇవ్వడం జరిగింది. అనంతరం శాంతికి ప్రతీకగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బెలూన్ లను ఎగురవేశారు.