Friday, November 15, 2024

దేశంలో మొదటి స్థానం మనదే: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

harish rao Participated in Freedom Rally at Sangareddy

సంగారెడ్డి: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయ పతాకంతో సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆర్ధిక మంత్రి శాఖ హరీశ్ రావు ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్ లో 75 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని మంత్రి హరీశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ… దసరా, దీపావళి,‌బోనాలు, బతుకమ్మ, పీరీల‌ పండుగలన్నీ ఒకే సారి కలసి వచ్చినట్లుంది. మనం ఇవాళ‌ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే అది ఎంతో మంది త్యాగ ఫలితమన్నారు. మహాత్మ గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, తిలక్ వంటి ఎంతో మంది మహనీయుల త్యాగం‌. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించిందని మంత్రి పేర్కొన్నారు. అన్నమో రామ చంద్ర అన్న‌ దశ నుండి ఆహార ఉత్పత్తి లో‌అద్భుతంగా స్వయం సమృద్ధి సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఆహార ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. సీఎం కేసీఆర్ ‌నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.

దేశంలోని రాష్ట్రాల్లో స్వంత ఆదాయం విషయంలో తెలంగాణ ‌నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్లలో 11.5% వృద్ధి రేటుతో దేశంలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. 9.7 శాతంతో రెండో‌స్థానం ఒరిస్సా, 9.2 శాతంతో హర్యానా మూడో‌స్థానంలో ఉందని చెప్పారు. 2014-15లో మన రాష్ట్ర తలసరి ఆదాయం లక్షా 24 వేల రూపాయలు‌ నేడు 2 లక్షల 78 వేలు. రెండున్నర రెట్లు పెరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు బడ్జెట్ 62 వేల కోట్లు, గత ఏడాది లక్షా 84 వేల కోట్లు ఖర్చు‌ చేసుకున్నం. ఏడేళ్లలో మూడింతలు పెంచుకున్నం. రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి తెలిపారు. కేంద్రం దేశంలోని 20గ్రామాలకు సంసాద్ ఆదర్శ్ గ్రామాల అవార్డులు ఇస్తే అందులో 19 తెలంగాణవి. ఇది సీఎం కేసీఆర్ గారి పాలనీ తీరుకు నిదర్శనమన్నారు. కొద్ది మంది రాజకీయ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నరు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత‌రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంత అభివృద్ధి ఉందా..? ఎందుకు అభివృద్ధి సాధించలేకపోతున్నాయి ఆ రాష్ట్రాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా గాంధీ గారు కలలు‌కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించింది. పల్లె ప్రగతి వల్ల‌ ప్రతీ‌ గ్రామంలో‌‌ ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, వైకుంఠధామాలతో విలసిల్లుతున్నాయి.

రెతు బంధు పథకం‌కింద‌ సంగారెడ్డి జిల్లా రైతులకు 2888 కోట్లు ఇచ్చామన్న మంత్రి రైతుల ఆత్మహత్యలు లేని జిల్లాగా , రాష్ట్రంగా మార్చుకున్నామని చెప్పారు. రైతు‌బీమా, రైతు బంధుతో రైతుల్లో‌భరోసా కల్పించినం. సంగారెడ్డి జిల్లాకు‌ కేసీఆర్ మరో వరం ఇచ్చారు. అది బసవేశ్వర,‌సంగమేశ్వర ప్రాజెక్టు. గుక్కెడు‌ తాగు నీళ్ల కోసం సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, వారాయణ ఖేడ్ బాధపడ్డాయి. ఇవాళ‌ ప్రభుత్వం ప్రతీ ఇంటికి నల్లాల‌ద్వారా తాగు నీరు అందిస్తోంది. వజ్రోత్సవాల‌వేళ‌ సీఎం మరో తీపి కబురు చెప్పారు. 57ఏళ్లకే పెన్షన్. మరో పది లక్షల మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నామన్నారు. సంగారెడ్డి ‌లో‌ 42 వేల మంది కొత్తగా పెన్షన్ పొందుతారు. డయాలసిస్‌ పేషంట్లకు పెన్షన్ ఇస్తామని సిఎం మరో శుభవార్త చెప్పారు. పంద్రాగస్టు నుండి రాష్ట్రంలో కొత్తగా పది లక్షల‌మందికి పెన్షన్లు. ఓనాడు‌జిల్లాలో‌ఒక్కటే‌ఆర్డీవో ఆఫీసు, తెలంగాణ ‌రాష్ట్రంలో ఇవాళ‌ నాలుగు ఆర్డీవో‌ఆఫీసులు‌ ఏర్పాటు చేసి పాలన ప్రజల‌ చెంతకు‌ తెవడం జరిగిందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

నారాయణ్ ఖేడ్, అమీన్ పూర్, తెల్లాపూర్ లను మున్సిపాలిటీ గా మార్చుకున్నం. వజ్రోత్సవాల‌వేళ‌ కుల, మత‌రహితంగా ఆనాటి‌ త్యాగ ధనులను గుర్తు‌చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య ‌ఫలాలు‌అందరికీ ‌అందాలంటే‌ ప్రభుత్వాలు ‌కుల, మత తారతమ్యాలు ‌లేకుండా పేదలే‌ ఎజెండాగా‌‌‌ సాగాలన్నారు. కొన్ని విచ్చిన్నకర శక్తులు‌ కులాల‌ మధ్య మతాల మధ్య పోరపొచ్చాలు‌ తెచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల‌మద్య ఐక్యత‌ చెడగొట్టి ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ శక్తుల‌పట్ల ఏమరుపాటుగా ఉండాలి. ఐక్యతా‌స్ఫూర్తిని కొనసాగిద్దాం. ప్రతీ ఇంటిపై మువ్వెన్నల‌జెండా ఎగురవేద్దామన్నారు. 16 వ‌తేదీ ఉదయం 11:30 కు సామూహిక జాతీయ గీతా లాపన చేద్దామని మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News