మనతెలంగాణ/హైదరాబాద్: ‘సన్డే ఫన్డే’ నేటి నుంచి ట్యాంక్‌బండ్‌పై మరోసారి అందుబాటులోకి తీసుకురానున్నట్టు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. గతంలో ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఈకార్యక్రమాన్ని నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే పాతబస్తీలోని చార్మినార్ వద్ద కూడా నాలుగైదు ఆదివారాలు ‘సన్డే ఫన్డే’ను ప్రభుత్వం నిర్వహించింది. అయితే కొన్ని రోజులుగా పలు కారణాలతో ఈ కార్యక్రమాన్ని ట్యాంక్‌బండ్, చార్మినార్ వద్ద ప్రభుత్వం నిర్వహించడం లేదు. ప్రస్తుతం ప్రజల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో ముందస్తుగా ట్యాంక్‌బండ్‌పై ‘సన్డే ఫన్డే’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నగరం నలుమూలల నుంచి పర్యాటకులు
గతంలో ఏర్పాటు చేసిన ‘సన్డే ఫన్డే’ కార్యక్రమానికి తిలకించడానికి వివిధ జిల్లాలతో పాటు నగరం నలుమూలల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుండడంతో అక్కడ స్టాళ్ల ఏర్పాటుకు సైతం అధికారులు అనుమతించారు. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు కేటగిరీల వారీగా లాటరీ ద్వారా షాపులను కేటాయించారు.
Sunday-Funday restarts at Tank Bund: Arvind Kumar