Saturday, November 23, 2024

నకిలీ కంపెనీలతో బ్యాంక్‌కు టోకరా

- Advertisement -
- Advertisement -

Fraud of Canara Bank with fake companies

రూ.2.5కోట్లుపైగా రుణం తీసుకున్న నిందితులు
సిసిఎస్‌లో ఫిర్యాదు చేసిన బ్యాంక్ అధికారులు

హైదరాబాద్: నకిలీ కంపెనీలు సృష్టించిన నిందితులు బ్యాంక్ నుంచి కోట్లాది రూపాయలు రుణం తీసుకుని నిండాముంచారు. పోలీసుల కథనం ప్రకారం… బాలానగర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో ఏఎఫ్‌ఎస్ కన్‌స్ట్రక్చన్స్ పేరుతో అడ్రస్ లేని కంపెనీని అహ్మద్ ఫయాజ్ అహ్మద్, మహ్మద్ చాంద్ పాషా ఇద్దరు సృష్టించారు. కంపెనీ పేరుతో కెనరా బ్యాంక్ నుంచి ఇద్దరు నిందితులు కలిసి రూ.1.30 కోట్లు రుణం తీసుకున్నారు. తిరిగి వాటిని చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు నిందితులు తనఖా పెట్టిన భూమికి సంబంధించిన కాగితాలను పరిశీలించి కంపెనీని తనిఖీ చేసేందుకు వెళ్లగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవు. అలాగే ప్రసాద్ రెడ్డి, మహాలక్ష్మి అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ కంపెనీని సృష్టించి కెనరా బ్యాంక్ నుంచి రూ.1.41 కోట్ల రుణం తీసుకున్నారు. తర్వాత బ్యాంక్ అధికారులు సంస్థల కార్యాలయం, భాగస్వాముల చిరునామాల కోసం వెళ్లగా ఎవరూ లేరు. రెండు కేసుల్లో నిందితులు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి బ్యాంక్‌ను మోసం చేసినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్ అధికారులు సిసిఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News