వచ్చే నెల నుంచి 9 జిల్లాల్లో పంపిణీ ప్రభుత్వాసుపత్రుల్లో ఇ ఔషది : హరీశ్
వచ్చే నెల నుంచి
9 జిల్లాల్లో పంపిణీ
ప్రభుత్వాసుపత్రుల్లో మందుల నిర్వహణకు ఇఔషధి
వైద్య పరికరాల
నిర్వహణకు ఇ-ఉపకరణ్
ఖరీదైన వైద్య పరికరాలు పాడైతే
వెంటనే రిపేర్ చేసేలా చర్యలు
సూపరింటెండెంట్ల వద్ద రూ.100
కోట్ల నిధులు: మంత్రి హరీశ్‌రావు
ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్,
ఇ-ఉపకరణ్ వెబ్‌సైట్ ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి కెసిఆర్ న్యూట్రిషియన్ కిట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వై ద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించా రు. గర్బిణీ స్త్రీలకు పోషకాహారం అందించాన్న సి ఎం కెసిఆర్ ఆలోచన మేరకు న్యూట్రీషియన్ కిట్ల ను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం దేశంలో ఎక్కడా లేదని, మొట్టమొదటిసారి తెలంగాణలోనే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కోఠిలోని తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టిఎస్‌ఎంఎస్‌ఐడిసి) కార్యాలయంలో శనివారం ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్(పిఎంయు)ను మంత్రి హరీశ్‌రా వు ప్రారంభించారు. వైద్య పరికరాల నిర్వహణకు ఇ- ఉపకరణ్ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో క్యాథ్‌ల్యాబ్, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, ఎక్స్ రే వంటి ఖరీదైన వైద్య పరికరాల నిర్వహణ కోసం ఈ యూనిట్‌ను ప్రారంభించినట్లు తె లిపారు. వెంటనే నుంచి ఎక్విప్‌మెంట్ పాలసీ అ మలులో వస్తుందని తెలిపారు. ఇదివరకు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరికరాలు పాడైతే మరమ్మత్తులు చేయడానికి కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఈ నూతన పాలసీ ద్వారా ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల తరహాలో ప్రభుత్వ ఆసుపత్రిలోని పరికరాలను వెంటనే గంటల్లో మరమ్మత్తులు చేయడం సాధ్యమవుతుందని అన్నారు.
ప్రభుత్వ దవాఖానలో రాష్ట్రంలోని వివిధ ఆసునత్రుల్లో 5 క్యాథ్‌ల్యాబ్‌లు 5 ఎంఆర్‌ఐ మెషిన్లు, 30 సిటీస్కార్‌లు వంటి కోట్ల విలువైన పరికరాలు ఉ న్నాయని తెలిపారు. 5 లక్షలకుపైగా విలువ ఉన్న పరికరాలు 1,020 ఉన్నాయని చెప్పారు. ఈ నూ తన పాలసీ ద్వారా వైద్య పరికరాలు పాడైన వెం టనే రిపేర్ చేయడం సాధ్యమవుతుందని, తద్వారా పేదలకు మెరుగైన వైద్యం లభిస్తుందని అన్నారు. వైద్య పరికరాల నిర్వహణకు ఈ- ఉపకరణ్ అందుబాటులోకి తెచ్చినట్లు హరీశ్‌రావు తెలిపారు.
అదనంగా 123 రకాల మందులు
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం ఉన్న మందులకు అదనంగా 123 మందులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. మందులలో ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్(ఎఎంఎల్ ), అడిషనల్ మెడిసిన్ లిస్టు(ఇఎంఎల్) అనే రెండు రకాల జాబితా ఉంటుందని, రాష్ట్రంలో ఈఎంఎల్, ఏఎంఎల్ లిస్ట్ మందులు గతంలో 720 రకాలు ఉండగా.. ప్రస్తుతం 843కి పెంచినట్లు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం చేయడానికి మన రా ష్ట్రం నుంచి ఒక బృందం తమిళనాడు పంపించామ ని తెలిపారు. ఇక నుంచి ఆసుపత్రుల్లో డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మందులు లేవని వైద్యం నిరాకరించే పరిస్థితి రా కుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మందుల నిర్వహణకు ఈ- ఔషధీ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ఆసుపత్రు ల్లో మూడు నెలలకు సరిపడా మందులు నిల్వ ఉం డేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇం దుకోసం 88885 26666 నెంబరుతో కాల్ సెం టర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే ఇమెయి ల్ విధానం అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఏఎంసీ పాలసీ అమలు కోసం రూ.17 కోట్ల కేటాయించామన్నారు. సర్జరీ జరిగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలోనే రోగికి అవసరమైన మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని వివరించారు. ఇందులో ఆసుపత్రు ల్లో అవసరాలకు అనుగునంగా సూపరింటెండెం ట్లు నేరుగా మందులు కొనుగోలు చేసేందుకు వారి వద్దనే రూ.100 కోట్లు పెడుతున్నామని తెలిపారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న మందలుపై కొంతమంది వైద్యులకు సమాచారం ఉండటం లేదని, అందుకే ఇఎస్‌ఎల్, ఎఎస్‌ఎల్ మందుల జాబితాతో ఒక బుక్‌లెట్‌ను రూపొందించిన వైద్యులకు అందజేస్తామని అన్నారు.
అర్హులందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలి..
కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, అర్హులందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. టీకాల పంపిణీలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. బూస్టర్ స్టాక్ పెం చాలని ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాశానని గుర్తు చేశారు. 50 లక్షల కోవీషీల్డ్ డోసులు కావాలని అడిగితే రెండు మూడు లక్షలే పంపించారని అన్నారు. రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ప్రభుత్వమే ఉచితంగా బూస్టర్ టీకాలు వేస్తోందని, అర్హులైన వారందరూ తప్పనిసరిగా బూస్టర్ డోసు తీసుకోవాలని పేర్కొన్నారు. స్వ ఛ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు అర్హులందరూ బూస్టర్ డోసు తీసుకునేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో సీ సెక్షన్ రేటు తగ్గిందని మంత్రి తెలిపా రు. 2021 ఆగస్టులో 62 శాతం ఉంటే.. ఈ ఏడా ది జూలైకి 56 శాతానికి తగ్గిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రభుత్వాసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే, ప్రస్తుతం 66.8 శాతానికి చేరాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రభుత్వం రూ.400కోట్లు వెచ్చించిందని తెలిపారు.
9 జిల్లాల్లో న్యూట్రిషియన్ కిట్ల పంపిణీ
రాష్ట్రంలో మొదట 9 జిల్లాల్లో న్యూట్రిషియన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అత్యధికంగా రక్తహీనత ప్రభావం ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, వికారాబాద్‌లో ఈ కిట్ అందిందించనున్నట్లు చెప్పారు. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి న్యూట్రీషియన్ కిట్ ఇవ్వనున్నట్లు, డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ అందజేస్తామని పేర్కొన్నారు. ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.2 వేలు ఉంటుందని అన్నారు. గర్బిణీలకు మూడో నెలలో ఒకసారి, ఆరో నెలలో మరోసారి రెండుసార్లు కిట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కిట్‌లో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్- 2 బాటిల్స్, ఒక కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ బాటిల్స్,ఐరన్ మాత్రలు, నెయ్యి ఉంటాయని వివరించారు. మూడు మెడికల్ కాలేజీలలో రద్దు చేసిన మెడికల్ సీట్ల విషయంలో ఒక కాలేజీకి విద్యార్థులకు రీ అలకేట్ చేయమని కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, మరో రెండు కాలేజీలకు ఉత్తర్వులు రాగానే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.