ముంబై: వన్డే సిరీస్ కోసం టీమిండియా శనివారం జింబాబ్వే బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు పలువురు సీనియర్లు సిరీస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో జింబాబ్వే సిరీస్‌లో కెఎల్.రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంతకుముందు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడంతో ధావన్ స్థానంలో అతన్ని కెప్టెన్‌గా నియమించారు. ధావన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా, సిరీస్‌లో హైదరాబాదీ స్టయిలీష్ బ్యాట్స్‌మన్ వివిఎస్.లక్ష్మణ్ టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసియాకప్‌లో పాల్గొనే జట్టు వెంట ఉన్నాడు. దీంతో లక్ష్మణ్‌కు జింబాబ్వే సిరీస్‌లో కోచ్ బాధ్యతలు అప్పగించారు. కాగా ఈ నెల 18న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. 20న రెండో, 22న మూడో వన్డే జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జరుగనున్నాయి.
Team India flies to Zimbabwe for ODI Series