గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

181
Traffic restrictions premises Golconda

Traffic restrictions premises Golconda

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా
ఆదేశాలు జారీ చేసిన జాయంట్ సిపి రంగనాథ్

మనతెలంగాణ, హైదరాబాద్ : గోల్కొండ ఫోర్ట్‌లో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ సిపి ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ఈ నెల 15వ తేదీన ట్రాఫిక ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు సాధారణ వాహనాల రాకపోకవలపై రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొం ఫోర్ట్ వరకు నిషేధం విధించారు.

రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ రోడ్డును కేవలం గోల్ పాస్(ఏ), పింక్, బ్లూ కారు పాస్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంది.
గోల్డ్, పింక్, బ్లూ కలర్ కారు పాస్ ఉన్న ఆహ్వానితులు సికింద్రాబాద్,బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే వారు వయా రేతిబౌలి, నానాల్ నగర్ జంక్షన్ అక్కడ లెఫ్ట్ తీసుకుని బాలిక భవన్, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రామ్‌దేవ్‌గూడ జంక్షన్, మకాయి దర్వాజ నుంచి గోల్కొండ ఫోర్ట్‌కు చేరుకోవాలి.
గోల్డ్ పాస్ ఉన్న వారి వాహనాలను ఫోర్ట్ మెయిన్ రోడ్డు గేట్ నుంచి ఫతేదర్వాజ రోడ్డులో పార్కింగ్ చేయాలి.
పింక్ పాస్ ఉన్న వారు వాహనాలను గోల్కొండ బస్‌స్టాప్ నుంచి 50 మీటర్ల దూరంలో వాహనాలను పార్కింగ్ చేయాలి.
బ్లూ కారు పాస్ ఉన్న వారు వాహనాలను ఫుట్‌బాల్, బాయ్స్ గ్రౌండ్ సమీపంలో పార్కింగ్ చేయాలి.
గ్రీన్ పాస్ ఉన్న వారు సెవన్ టూంబ్స్, బంజారా దర్వాజ, ఓవైసీ గ్రౌండ్ వైపు రావాలి, లంగర్‌హౌస్ నుంచి వచ్చే సి కారు పాస్ ఉన్న వారు ఫ్లైఓవర్ కింద నుంచి ఫతేదర్వాజ వద్ద రైటర్న్ తీసుకుని బడా బజార్, జిహెచ్‌ఎంసి ఐస్‌ల్యాండ్, ఓవైసి గ్రౌండ్ నుంచి రావాలి. వాహనాలను ఓవైసీ లేదా జిహెచ్‌ఎంసి ప్లేగ్రౌడంవకు 500 మీటర్ల దూరంలో పార్కింగ్ చేయాలి.
రెడ్ కారు పాస్(డి) ఉన్న వారు షేక్‌పేట నాలా, టోలీచౌకి, సెవెన్ టూంబ్స్ నుంచి బంజారాదర్వాజ, ప్రియదర్శిని స్కూల్, గోల్కొండ నుంచి రావాలి. వాహనాలను ప్రియదర్శిని స్కూల్ వద్ద పార్కింగ్ చేయాలి.
ఈ కారు పాస్ ఉన్న వారు లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకుని, తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుని ఫతేదర్వాజా నుంచి రావాలి, వాహనాలను హుడా పార్క్ సమీపంలో నిలపాలి. సాధారణ ప్రజలు షేక్‌పేట, టోలీచౌకి నుంచి వచ్చే వారు వాహనాలను సెవెన్ టూంబ్స్ వద్ద పార్కింగ్ చేయాలి. సందర్శకులు ఉచితంగా ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేశారు.
ఉత్సవాలు ముగిసిన తర్వాత గోల్డ్, పింక్, బ్లూ కలర్ కారు పాస్ ఉన్న వారు మకాయి దర్వాజ, రామ్‌దేవ్‌గూడ, లంగర్‌హౌస్ నుంచి వెళ్లాలి.
పాసులు ఉన్న వారు వాహనాల లెఫ్ట్ సైడ్ మీర్రర్‌పై అతికించాలి. ఇది పోలీసులు గుర్తించేందుకు సులభంగా ఉంటుంది. వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని పోలీసులు కోరారు.
సికింద్రాబాద్….పరేడ్ గ్రౌండ్స్…
స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. టివోలి జంక్షన్ మీదుగా బ్రూక్ బాండ్, ఎన్‌సిసి జంక్షన్ వైపు మళ్లించారు. టివోలి మీదుగా వచ్చే వాహనాలపై ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షలు విధించారు.