హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి స్వల్పంగా కంపించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో ప్రకంపనలు వచ్చాయి. అనేక గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించినట్టు గుర్తించారు.
ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో పామూరు మండలంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. పామూరు, పరిసర గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లు స్వల్పంగా కుదుపులకు గురికావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్వల్పంగా భూమి కంపించింది. దీంతో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత నమోదు కాలేదు. ఆస్తి నష్టం కూడా ఏమీ సంభవించలేదు. కానీ జనం మాత్రం బిక్కుబిక్కు మని ఉన్నారు. ఆ తర్వాత కూడా భయపడ్డారు. స్వల్ప భూకంపం కావడంతో.. ఏమీ కాదులే అని అధికారులు ధైర్యం చెప్పారు…!!