Monday, December 23, 2024

పేదింటి పెద్దన్న సిఎం కెసిఆర్: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha speech about CM KCR

హైదరాబాద్: సిఎం కెసిఆర్ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకు పెద్దన్నలా నిలుస్తున్న విషయం మరోసారి రుజువైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి ఆగష్టు 15 నుంచి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించడం, లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని ప్రశంసించారు. తాజా నిర్ణయంతో 45 లక్షల మందికి పైగా లబ్దిదారులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కొనియాడారు.  దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 4 లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కవిత మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News