Tuesday, November 26, 2024

భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా విజయవంతం

- Advertisement -
- Advertisement -

Bharat Biotech successfully developed nasal vaccine 'BBV154'

న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ ‘ బీబీవీ 154 ’ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, వ్యాధి నిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని వెల్లడించింది. కొన్ని మార్పులు చేసిన ఆడినోవైరస్ వెక్టార్ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ‘వాషింగ్టన్ యూనివర్శిటీ ఇన్ సెయింట్ లూయిస్’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్టు వివరించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రయోగ ఫలితాలను ఔషధ నియంత్రణ సంస్థలకు అందజేసినట్టు వెల్లడించింది.

ముఖ్యంగా పేద, మధ్య తరగతి దేశాలకు అతి తక్కువ వ్యయంతో టీకాను అందించాలనే లక్షంతో ఈ నాసల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ పేర్కొంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సాయంతో భారత ప్రభుత్వం ఈ టీకా అభివృద్ధి ప్రయోగాలకు సహకరించినట్టు వివరించింది.న బీబీవీ 154 టీకాను ప్రాథమిక డోస్‌గా, బూస్టర్ డోస్‌గా వినియోగించడంపై వేర్వేరుగా ప్రయోగాలు నిర్వహించారు. ఈ టీకాను 28 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపర్చి సులభంగా రవాణా చేయవచ్చు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీబీవీ 154 టీకా విజయవంతమైందని ప్రకటించినందుకు గర్వపడుతున్నామని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News