Monday, January 20, 2025

నేతాజీ అస్థికలను రప్పించి డిఎన్‌ఎ పరీక్షలు జరపాలి: అనితా బోస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తిరిగి తీసుకురావలసిన సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్ పాఫ్ తెలిపారు. 1945 ఆగస్టు 18న సంభవించిన సుభాష్ చంద్రబోస్ మరణంపై కొందరిలో ఇప్పటికీ నెలకొన్న అనుమానాలకు బోస్ అస్థికలకు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించడం ద్వారా సమాధానం దొరకగలదని ఆమె పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో జన్మించి జర్మనీలో ఆర్థికవేత్తగా కొనసాగుతున్న అనితా బోస్ సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించడం ద్వారా టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ అస్థికలకు శాస్త్రీయంగా రుజువు లభించగలదని, ఇందుకు జపాను ప్రభుత్వం అంగీకారం కూడా లభించిందని ఆమె తెలిపారు. భారత స్వాతంత్య్ర వేడుకల ఆనందాన్ని తన తండ్రి అనుభవించలేదని, కనీసం ఆయన అస్థికలైనా భారత గడ్డకు తిరిగిరావలసిన సయం ఇప్పుడు ఆసన్నమైందని నేతాజీ ఏకైక కుమార్తె అనితా బోస్ సూచించారు. అస్థికల నుంచి డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించడం ఆధునిక టెక్నాలజీ ద్వారా ఇప్పుడు సాధ్యమేనని, టోక్యోలోని రెంకోజో ఆలయం భద్రపరిచిన అస్థికలు నేతాజీవో కావో నిర్ధారించుకునే అవకాశం ఈ పరీక్షల ద్వారా ఏర్పడగలదని ఆమె తెలిపారు.

Anita Bose calls for DNA Test of Netaji’s Ashes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News