Monday, December 30, 2024

దేశభక్తిని చాటిన సామూహిక జాతీయ గీతాలాపన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/భువనగిరి: భారత స్వతంత్ర 75వ వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం భువనగిరి జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని వినాయక చౌరస్తా, కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సామూహిక జా తీయ గీతాలాపన కార్యక్రమం మున్సిపల్ ఆధ్వర్యంలో దేశభక్తి ఉ ప్పొంగేలా కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వారిని, వారి కృషిని, కారణాలను నేటి యువత క్షున్నంగా తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భువనగిరి జిల్లాలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పాల్గొంటున్నందు వల్లనే విజయవంతం అవుతున్నాయని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్, మున్సిపల్ వార్డు సభ్యులు ఆబోతుల కిరణ్ కుమార్, శ్రీ దిడ్డికాడి భగత్, పంగరెక్క స్వామి, పోత్నక్ ప్రమోద్ కుమార్, జిట్టా వేణుగోపాల్ రెడ్డి, అందె శంకర్ , పడిగెల రేణుక ప్రదీప్, రత్నపురం బలరాం, మొహామ్మద్ ఖాజా అజీముద్దీన్, బానోత్ వెంకట్ నర్సింగ్ నాయక్, గోమరి సుధాకర్ రె డ్డి, కోఆప్షన్ శ్రీ రాచమల్ల రమేష్, అధికారులు, నాయకులు శ్రీ తు మ్మల పాండు, జహంగీర్, చెన్న మహేష్, పచ్చల జగన్మోహన్, ఇట్టబోయిన గోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దేవరకొండలో..- 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ, దేవరకొండ స్పోర్ట్ అసోసియేషన్ , రెవిన్యూ శాఖ, పురపాలకశాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ అవరణలో సముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వజ్రోత్సవాల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపనలో పాల్గోని దేశభక్తి చాటాలన్నారు. భారతదేశ భవితను రాజ్యాంగా బద్దంగా ముందుకు తీసుకేళ్ళాల్సిన బాధ్యత విద్యార్ధులు, ఉద్యోగులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డివో గొపిరాం, డిఎస్‌పి నాగేశ్వర్‌రావు,ఎంపీపీ నల్గాసు జాన్‌యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేష్‌గౌడ్, దేవరకొండ స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌విటి, మున్సిపల్ చైర్మన్ ఆల్లంపల్లి నర్సింహ్మ, వైస్ చైర్మన్ రహాత్ అలి, మున్సిపల్ కమీషనర్ వెంకటయ్య,సీఐ శ్రీనివాస్,సుభాష్‌గౌడ్, పున్న వెంకటేశ్వర్లు, వెంకటేష్‌గౌడ్, రైస్, తౌఫిక్, జయప్రకాష్, దేవేందర్, వలసాని వెంకన్న, తాళ్ల శ్రీధర్‌గౌడ్, క్రిష్ణ కిషోర్, రాజఖ కుమార్‌రెడ్డి, క్రాంతి మాస్టర్, లావణ్య, నల్లా నర్సింహ్మ, వివిఆర్, కుమార్, చందు, వెంకటేష్, తదితరులు పాల్గోన్నారు

యాదాద్రిలో..భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవ పుర స్కరించుకొని జరుపుకుంటున్న వజ్రోత్సవ శుభాకాంక్షలు ముఖ్య మంత్రి కేసీఆర్ పిలుపు మేరకు యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహి ం చిన సామూహిక జాతీయ గీత ఆలాపన దేశభక్తిని చాటింది. మ ం గళవారం యాదగిరిగుట్ట పట్టణంలో బస్టాండ్, పాత గుట్ట చౌర స్తా లో ఏర్పాటుచేసిన జాతీయ జెండాని ఆవిష్కరించి సామూహిక జా తీయ గీతాన్ని ఆలపించారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత పోలీసు శాఖ అధికారులు సిబ్బంది వివిధ శాఖల అధికారులు విద్యార్థులు రా జకీయ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు అశేష జనులు పాల్గొని జా తీయ జెండాకు సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాలు అన్ని చేశారు. ఈ సందర్భంగా దేశభక్తిని చాటే విధంగా జాతీయ నాయకులకు జో హా ర్లు తెలియజేస్తూ దేశ సంపదను చాటుతూ అమరుల త్యాగాలను గుర్తు చేశారు.

నకిరేకల్‌లో.. జాతీయ గీతాలాపన వలన ప్రజల్లో దేశభక్తి పెంపొందిస్తుందని నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కమీషనర్ బాలాజీ అన్నారు. మంగళవారం నకిరేకల్ మెయిన్ సెంటర్‌లో జరిగిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొ న్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గుండాలలో.మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ గీతాలాపన అధికారులు ప్రజా ప్రతినిధులు సమక్షంలో 11 గంటల 30 నిమిషాలకు జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పాటు వివిధ రంగాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు రహదారుల వెంట వెళ్లే వాహనదారులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ భవాని చాటుకున్నారు ఈ కా ర్యక్రమంలో ఎంపీపీ అమరావతి జెడ్ పి టి సి గోల్కొండ లక్ష్మి ఎం పీడీవో శ్రీనివాస్ జిల్లా కో ఆప్షన్ నెంబర్ ఎండి ఖలీల్ వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి తాసిల్దార్ శ్రీనివాస్ రాజ్ ఎస్ ఐ యా కయ్య ఎంపీడీవో పైళ్ల జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీపీ రావుల హరితా దేవి సంగి వేణుగోపాల్ టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖ లీల్ శ్రీనివాస్ రమేష్ రెడ్డి మండల రామకృష్ణారెడ్డి గార్లపాటి సో మిరెడ్డి ఇమ్మడి దశరథ మద్దుల బాల్రెడ్డి రాసిచ్చిన పద్మనాభం గో ల్కొండ రాములువివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపిటిసిలు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News